శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (11:43 IST)

''రంగస్థలం'' కోసం వేచి వుండలేకపోతున్నా: సమంత అక్కినేని

సుకుమార్‌ తాజాగా రూపొందించిన చిత్రం ''రంగస్థలం'' ఈ సినిమా షూటింగ్ ముగిసిందని హీరోయిన్ సమంత ట్వీట్ చేసింది. మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని సమంత వెల్లడిం

సుకుమార్‌ తాజాగా రూపొందించిన చిత్రం ''రంగస్థలం'' ఈ సినిమా షూటింగ్ ముగిసిందని హీరోయిన్ సమంత ట్వీట్ చేసింది. మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని సమంత వెల్లడించింది. ఇందులో చెర్రీ చిట్టిబాబుగా నటిస్తున్నాడు. 
 
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో చెవిటివాడైన చిట్టిబాబుగా రాంచరణ్‌ అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇంక సమంత ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. లచ్చిమిగా రంగస్థలం సినిమాలో సమంత నటించబోతున్నట్లు సమాచారం. 
 
తాజాగా సమంత ట్వీట్ చేస్తూ... ఫిబ్రవరి 3న రంగస్థలం షూటింగ్ పూర్తయ్యింది. రాంచరణ్‌, సుకుమార్‌, మైత్రీ నిర్మాణ సంస్థ వంటి ప్రత్యేక బృందంతో చేసిన స్పెషల్ జర్నీ ఇదని తెలిపింది. ఈ బిగ్ బ్యాంగ్ కోసం వేచి వుండలేకపోతున్నానని సమ్మూ ట్వీట్ చేసింది.