సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (17:24 IST)

సీరియల్ ఆర్టిస్టుగా రాశీ ఖన్నా

Rashikhanna
Rashikhanna
రాశీ ఖన్నా సీరియల్ ఆర్టిస్టుగా న‌టించింది. ఆమె లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో సీరియల్ ఆర్టిస్టుగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వించడానికి రెడీ అయ్యారు రాశీ. ఇంత‌కీ ఏ సీరియ‌ల్ అనుకుంటున్నారా! ఇది సినిమాలో వ‌చ్చే సీరియ‌ల్ ఎపిసోడ్‌. ఆ సినిమా పక్కా కమర్షియల్. ఈరోజే రాశి లుక్‌నువిడుద‌ల‌చేస్తూ చిత్ర యూనిట్ ఇలా పేర్కొంది. 
 
రాశీ ఖన్నా సీరియల్ ఆర్టిస్టుగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వించడానికి రెడీ అయ్యారు. ఈమె కారెక్టర్ ఎంత ఫన్నీగా ఉండబోతుందో.. మొన్న విడుదలైన ట్రైలర్‌తోనే అర్థమై ఉంటుంది. సినిమాలో దీనికి మించి ఫన్ ఉంటుందంటున్నారు మేకర్స్. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు అని పేర్కొన్నారు. 
 
మారుతి తెరకెక్కిస్తున్న  మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.