1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జూన్ 2016 (12:48 IST)

రష్మీ గౌతమ్ కొత్త ప్రయోగం.. ముఖానికి సర్జరీ కోసం అమెరికాకు సెక్సీ యాంకర్!

జబర్దస్త్ యాంకర్, గుంటూర్ టాకీస్ హీరోయిన్ రష్మీ గౌతమ్ తన అందాలను మెరుగుపరుచుకునేందుకు రెడీ అవుతోంది. సెక్సీ యాంకర్‌గా పేరు కొట్టేసిన రష్మీ గౌతమ్ ప్రస్తుతం సినీ ఛాన్సుల కోసం అందాలకు వన్నె తెచ్చుకోనుంది. ఈ బ్యూటీ కొత్తగా కనిపించేందుకు ప్రయత్నాలు మొదలెట్టేసిందని.. చిన్నపాటి సర్జరీ కోసం రష్మీ అమెరికాకు ఫ్లైట్ ఎక్కేసిందని తెలుస్తోంది. 
 
అక్కడ ముఖానికి సంబంధించిన కొన్ని సర్జరీలతో పాటు.. తన అందాన్ని మరింతగా పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకుందని సమాచారం. భారత్‌కు వచ్చాక టాలీవుడ్ ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అయ్యేలా మేకోవర్ ఉండాలని రష్మీ ప్లాన్ చేస్తోంది. అటు ప్రేక్షకులతోపాటు ఇటు ఇండస్ట్రీ జనాలను కూడా ఆకట్టుకోగలిగిందంటే.. రష్మీ స్టార్ హీరోయిన్ అయిపోయే ఛాన్సుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.