శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (13:48 IST)

నన్ను వదిలి ఆయన వద్దకు వెళ్లలేదు... అకీరా రాకపై రేణూ దేశాయ్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్‌ల దాంపత్య జీవితానికి గుర్తుగా అకీరా నందన్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ అకీరా ఇపుడు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాడు. దీంతో తల్లి రేణూను వదిలి తండ్రి పవన్ వద్దక

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్‌ల దాంపత్య జీవితానికి గుర్తుగా అకీరా నందన్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ అకీరా ఇపుడు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాడు. దీంతో తల్లి రేణూను వదిలి తండ్రి పవన్ వద్దకు అకీరా వచ్చేశాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
 
ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయవాడలో అద్దె ఇంటి గృహ ప్రవేశం చేశారు. శాస్త్రోక్తంగా తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరాలతో కలసి ఆయన గృహప్రవేశం చేశారు. దీంతో రేణూను అకీరా వదిలిపెట్టాడంటూ ప్రచారం సాగుతుండటంపై రేణూ స్పందించింది. 
 
"స్కూలు సెలవలను గడపడానికే తండ్రి వద్దకు అకీరా వచ్చాడు. అకీరా హైదరాబాదుకు షిఫ్ట్ కాలేదు. పవన్‌తో కాలసి అకీరా కనిపించడంతో... నిన్నటి నుంచి నాకు వరుసగా మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ మెసేజ్‌లకు సమాధానంగానే నేను ఈ క్లారిటీ ఇస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.