సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:43 IST)

రేణూ దేశాయ్ 'బద్రి' చేదు జ్ఞాపకాలు... నా కళ్లలో నీటితెర చూశారా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి 17 ఏళ్ల క్రితం రేణూ దేశాయ్ బద్రి చిత్రంలో నటించింది. బద్రి 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో బద్రిలో పాటను షూట్ చేస్తున్నారు. ఐతే నా కళ్ల వెంట నీళ్లు ఆగడం లేదు. ఎంద

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి 17 ఏళ్ల క్రితం రేణూ దేశాయ్ బద్రి చిత్రంలో నటించింది. బద్రి 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో బద్రిలో పాటను షూట్ చేస్తున్నారు. ఐతే నా కళ్ల వెంట నీళ్లు ఆగడం లేదు. ఎందుకంటే పుణే నుంచి ఆ సమయంలో నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. 
 
దాని సారాంశమేమిటంటే... నా స్నేహితురాలు పుణెలో జరిగిన బైక్ యాక్సిడెంటులో మృతి చెందింది. ఆమె చనిపోయిందన్న వార్త వినగానే నా గుండె చెరువైంది. ఏడుపు తన్నుకొచ్చింది. కానీ పాట షూటింగు జరుగుతోంది. ఆ ఆవేదనను లోలోనే అదిమిపట్టుకుని నటించాను. ఎంత ఆపుకుందామన్నా నా కళ్లు మాత్రం కన్నీళ్లను ఆపుకోలేకపోయాయి అంటూ రేణూ దేశాయ్ తన ట్విట్టర్లో పేర్కొంది.