శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 మే 2022 (23:23 IST)

రిపీట్ ఆడియ‌న్స్ వ‌స్తారు రాసుకోండి - ఉద్వేగానికి లోనైన మ‌హేష్‌బాబు

Mahesh-keerti-parasuram
Mahesh-keerti-parasuram
మ‌హేష్‌బాబు న‌టించిన `స‌ర్కారువారి పాట‌`ప్రీరిలీజ్ వేడుక‌ శ‌నివారంనాడు హైద‌రాబాద్ యూసుఫ్‌గూడా పోలీస్‌ గ్రౌండ్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు కాస్త ఉద్వేగానికి గుర‌య్యారు. రెండేళ్ళ‌లో ఎన్నో జ‌రిగాయి. నా ద‌గ్గ‌రున్న‌వాళ్ళు దూర‌మ‌య్యారంటూ.. (అన్న ర‌మేష్‌బాబు)ను గుర్తుచేసుకున్నారు. వెంట‌నే త‌మాయించుకుని అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు.

 
మ‌హేష్‌బాబు మాట్లాడుతూ, రెండేళ్ళు అయింది ఇలాంటి ఫంక్ష‌న్ జ‌ర‌గ‌డం. చాలా ఆనందంగా వుంది. స‌ర్కారువారిపాట‌లో ప‌ర‌శురామ్ నా డైలాగ్ మాడ్యులేష‌న్‌, బాడీ లాంగ్వేజ్ బాగా డిజైన్ చేశాడు. కొన్ని సీన్లు చేసేట‌ప్పుడు పోకిరి రోజులు గుర్తుకు వ‌చ్చాయి. ప‌ర‌శురామ్ క‌థ వివి ఓకే చేశాక మెసేజ్ పెట్టాను. ఒక్క‌డు సినిమా చూసి హైద‌రాబాద్ వ‌చ్చాడ‌ని అన్నాడు. అందుకే మీతో సినిమా ఇర‌గ‌దీస్తాన‌ని అన్నాడు.


ఈ సినిమాలో చాలా చాలా హైలైట్స్ వుంటాయి. హీరో హీరోయిన్ల ట్రాక్ కోస‌మే రిపీట్ ఆడియ‌న్స్ వుంటారు. ఇది రాసుకోండి. ఆమె పెర్ ఫార్మెన్స్  అద్భుతంగా ఇచ్చింది. థ‌మ‌న్‌తో చాలా గ్యాప్ వ‌చ్చింది. మ‌ళ్ళీ క‌లిసి చేశాం. క‌ళావ‌తి.. తోపాటు మిగిలిన‌వి మాస్‌, యూత్‌కు క‌నెక్ట్ అవుతున్నాయి. నేను థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు పెద్ద ఫ్యాన్‌ను. రామ్‌ల‌క్ష్మ‌ణ్ నా ఫేవ‌రేట్ యాక్ష‌న్ మాస్ట‌ర్లు. వారిలో న‌చ్చింది ఏమంటే.. హీరోను ఎలా చూసుకుంటారో, ఫైట‌ర్ల‌ను అలా చూసుకుంటారు.

 
శేఖ‌ర్ మాస్ట‌ర్‌.. మైండ్ బ్లాంక్ ఎంత ఇంపాక్ట్ వుందో తెలిసో. మాస్ సాంగ్ కూడా అలానే వుంటుంది. ఆర్ట్ డైరెక్ష‌ర్ ప్ర‌కాష్‌ 10 రోజుల్లో అద్భుత‌మైన సెట్ వేశాడు. మార్తాండ్ గారు పోకిరిని దాటుతుంద‌ని అన్నారు. అనంత‌శ్రీ‌రామ్‌గారు పాట‌కు ప‌ది ప‌దిహేను వ‌ర్ష‌న్‌లు చేశారు. కెమెరా మ‌దిగారు శ్రీ‌మంతుడు ఎంత బాగా తీశాడో తెలుసు. అంత‌కంటే బాగా తీశాడు. 


నిర్మాత‌లు మైత్రీమూవీమేక‌ర్స్, 14 రీల్స్ బేన‌ర్‌లో మంచి సినిమా తీశారు. కోవిడ్ టైంలో అంద‌రూ క‌ష్ట‌ప‌డి స‌పోర్ట్ చేశారు. రెండేళ్ళ‌లో చాలా జ‌రిగాయి. నా ద‌గ్గ‌రున్న‌వారు దూర‌మ‌య్యారు. ఏది జ‌రిగినా మీ అభిమానం మార‌లేదు. ఇది చాలు ధైర్యంగా వెళ్ళ‌ఢానికి అంటూ ఉద్వేగానికి గుర‌య్యారు. అభిమానులు ఆశీస్సులు వుండాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా అడ‌విశేష్‌, సుమ‌.. మ‌హేష్‌బాబుతో చిట్ చాట్‌లా స‌ర‌దాగా సాగింది. ఆ వివ‌రాలు..
కాఫీ విత్ క‌ర‌ణ్ త‌ర‌హాలో అడ‌విశేష్‌.. మ‌హేష్‌బాబుతో చిట్ చాట్‌.. ఫ్యాన్స్ గురించి అడిగిన ప్ర‌శ్న‌కు.. మ‌హేస్ ఇలా స‌మాధానం ఇచ్చారు.

 
- ఏ జ‌న్మ‌లో చేసుకున్న అదృష్ట‌మోకానీ, అభిమానులంద‌రూ వున్నారు. రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదుకానీ, వారి కోస‌మే సినిమాలు చేస్తున్నాను. అలాగే నిర్మాత గా మేజ‌ర్ సినిమా గురించి మ‌హేష్ చెబుతూ.. మేజ‌ర్ అనే సినిమా జూన్‌3న రాబోతోంది. గ్రేట్ సినిమా రాబోతోంది. సినిమా నిర్మాణంలో వుండ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. అడ‌విశేష్ టీమ్‌తో చేయ‌డం ఆనందంగా వుంది. అన్నారు.

 
సుమ చిట్‌చాట్‌..
 నిర్మాత‌ల గురించి చెబుతూ,, ప్ర‌తి సినిమా మైండ్ బ్లాక్ సినిమా కావాల‌ని కోరుకుంటాను. థ‌మ‌న్ గురించి చెబుతూ... క‌ళావ‌తి పాట నేను విన్న‌ప్పుడు ఎలా వుంది అని అడిగాను. న‌న్ను న‌మ్మండ‌ని అన్నాడు. అలా నా మైండ్ బ్లాండ్ చేశాడు. కీర్తి సురేష్ న‌ట‌న మైండ్ బ్లాంక్ చేస్తుంది. అనంత‌రం మ‌హేష్‌బాబుతో ఒక ఫొటో అంటూ కీర్తి సురేష్ ఫొటో దిగ‌డం విశేషం.