మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (08:20 IST)

"వకీల్ సాబ్" అంత బాగుందా.. Review #VakeelSaab from Overseas.. 4 స్టార్ రేటింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళలు హీరోయిన్లుగా నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. 
 
ముఖ్యంగా, మూడేళ్ళ విరామం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రం. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. అందరి అంచనాలకు తగినట్టుగానే ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను అలరించాయి. దీంతో ఈ సినిమాపై క్రేజ్‌ను మరింతగా పెంచేశాయి. 
 
ట్రైలర్ అయితే, టాలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది. రీసెంట్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అఫీషియల్‌ యూట్యూబ్‌లో తిలకించిన వారి విషయంలో కూడా 'వకీల్‌ సాబ్‌' రికార్డును క్రియేట్‌ చేశాడు. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం ఏప్రిల్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఓవర్సీస్‌ సెన్సార్‌ సభ్యుడనని చెప్పుకునే మోస్ట్ కాంట్రవర్సియల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్‌ ఉమర్‌ సంధు.. ఈ చిత్రాన్ని చూసినట్లుగా తెలుపుతూ.. ఫస్ట్ రివ్యూ అంటూ.. సినిమా టెర్రిఫిక్‌ అని నాలుగు స్టార్స్‌ ఇచ్చేశాడు. ఇప్పుడాయన ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 
ఉమర్ సంధు రాసిన రివ్వూ ప్రకారం ఈ మూవీ సూపర్బ్‌గా ఉంది. అందుకే ఏకంగా నాలుగు స్టార్స్‌తో కూడిన రేటింగ్ ఇచ్చేశారు. అయితే, ఈ చిత్రం తొలి భాగం స్లోగా నడుస్తుందట. కానీ.. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడని, పవన్‌ కల్యాణ్‌ తన కెరియర్‌లోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటాడని ఉమర్‌ చెప్పుకొచ్చాడు. 
 
అద్భుతమైన విజువల్స్‌తో, కొన్ని స్పీచ్‌ లెస్‌ సీన్లతో సినిమా ఉందని, పవన్‌ కల్యాణ్‌ ఈ చిత్రం ద్వారా ఓ పవర్‌ ఫుల్‌ మెసేజ్‌ని ఇవ్వబోతున్నాడని చెబుతూ.. ఈ చిత్రానికి నాలుగు స్టార్లు ఇచ్చేశాడు. 
 
అయితే ఉమర్‌ సంధు అంతా బాగా చెప్పినా.. ఆయన మాటను ఇప్పుడప్పుడే ఎవరూ ఎక్కించుకోవడం లేదు. ఎందుకంటే.. గతంలో కూడా ఆయన ఇలాంటి జడ్జిమెంట్‌తోనే.. ప్రేక్షకులని నిరాశకు గురిచేశాడు. అందుకే.. సినిమా విడుదల వరకు ఇలాంటివి పట్టించుకోకూడదని ఫ్యాన్స్‌ కూడా ఫిక్సయ్యారు. ఇదే విషయం కామెంట్స్‌ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.