శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 22 జులై 2019 (21:50 IST)

వ‌ర్మా‌.. అస‌లు నీకు ఏమైంది..?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తాజా చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. రామ్, నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్లుగా రూపొందిన ఇస్మార్ట్ శంక‌ర్  అన్ని ఏరియాల్లో హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో బ్లాక్‌బ‌ష్ట‌ర్ దిశ‌గా ప‌రుగులు తీస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్‌కి టెంప‌ర్ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన స‌క్స‌స్ రాలేదు. దీంతో ఈ స‌క్స‌ెస్‌ని పూరీ టీమ్ బాగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అయితే.... శిష్యుడు పూరీకి స‌క్స‌ెస్ రావ‌డంతో ఆనందానికి అవ‌ధులు లేవు అన్న‌ట్గుగా ఎంజాయ్ చేస్తున్నారు.
 
ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సస్ సాధించ‌డంతో వ‌ర్మ ముంబాయి నుంచి హైద‌రాబాద్‌కి వ‌చ్చారు. ఇస్మార్ట్ టీమ్ వ‌ర్మ‌కి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో వ‌ర్మ త‌న శిష్యుడు పూరీ జ‌గ‌న్నాథ్‌కి గ‌ట్టిగా ముద్దిచ్చాడు. ఈ ఫోటోను ఇస్మార్ట్ శంక‌ర్‌లో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించిన స‌త్య‌దేవ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. హైద‌రాబాద్ శ్రీరాములు ధియేట‌ర్‌కి రామ్ గోపాల్ వ‌ర్మ‌, ఆర్ఎక్స్ 100 అజ‌య్ భూప‌తి, ఇస్మార్ట్ శంక‌ర్ టీమ్‌తో క‌లిసి వెళ్లారు. అక్క‌డ కూడా ఇస్మార్ట్ టీమ్ పూరి, ఛార్మిల‌తో క‌లిసి వ‌ర్మ స‌క్స‌స్‌ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. 
 
వ‌ర్మ ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌ెస్‌ని ఎంజాయ్ చేస్తుండ‌టం చూసి అస‌లు వ‌ర్మ‌కి ఏమైంది అని షాక్ అవుతున్నారు. ఇస్మార్ట్ టీమ్ సైతం షాక్ అయ్యారేంటే వ‌ర్మ ఏ రేంజ్ హడావిడి చేస్తున్నాడో అర్ధం చేసుకోవ‌చ్చు.