'ధృవ'లో చెర్రీకి గుండెలో పెడితే 'ఇస్మార్ట్ శంకర్'లో రామ్‌కి అక్కడ పెట్టాడు పూరీ... రిపోర్ట్ ఎలా వుంది?

iSmart Sankar
Last Modified గురువారం, 18 జులై 2019 (17:07 IST)
వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎంతగానో మనసుపెట్టి తీసిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రంలో హీరో రాంను మాస్ హీరోగా చూపిస్తూ హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్‌ను పూర్తిస్థాయి క్లీవేజ్ షోకి ఉపయోగించాడు. ఎన్నాళ్లగానో హిట్ కొట్టాలన్న కసితో తీసిన పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ ఎలా వుందో చూద్దాం.

హైదరాబాద్ పాత బస్తీలో ఇస్మార్ట్ శంకర్ కిరాయి రౌడీ. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో విలన్ ఓ డైలాగ్ చెప్తాడు... డబ్బులు ఇస్తే నిన్ను కూడా ఏసేస్తానంటూ... అలాంటివాడన్నమాట ఇస్మార్ట్ శంకర్. డబ్బు ఇస్తే చాలు ఎంతడివాడినైనా మర్డర్ చేసేస్తాడు. అలా మాజీ ముఖ్యమంత్రి విశ్వనాథ్‌ని హత్య చేస్తాడు శంకర్. ఈ కేసులో జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత జైలు నుండి తప్పించుకుని తన ప్రేయసి చాందిని (నభా నటేష్)ని తీసుకుని గోవా చెక్కేస్తాడు. ఐతే విలన్లు శంకర్ పైన ఎటాక్ చేసే సమయంలో అతడి ప్రేయసి చనిపోతుంది.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి విశ్వనాథ్ హత్య కేసును విచారణ చేసేందుకు ఎంక్వైరీ ఆఫీసర్‌గా అరుణ్(సత్యదేవ్) రంగంలోకి దిగుతాడు. అతడి ప్రేయసి, సైంటిస్ట్ సారా(నిధి అగర్వాల్). కాగా మాజీ సీఎం హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించిన అరుణ్‌ని విలన్ గ్యాంగ్ హత్య చేస్తుంది. అదే సమయంలో ఇస్మార్ట్ శంకర్ పైనా ఎటాక్ జరుగుతుంది. ఈ క్రమంలో అరుణ్ చనిపోవడంతో అతడి మెమరీని బతికి వున్న ఇస్మార్ట్ శంకర్‌కి ఓ చిప్ పెట్టడం ద్వారా బదిలీ చేస్తుంది సైంటిస్ట్ సారా. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగిలిన సినిమా.

చిత్రంలో హీరోహీరోయిన్ల నటన గురించి చెప్పాల్సి వస్తే... హీరో రాం మాస్ క్యారెక్టర్లో ఇరగదీశాడు కానీ తెలంగాణ యాసను పలికించడంలో కష్టపడ్డాడు. మొత్తమ్మీద తన శక్తిమేరకు నటించాడు. ఇక నభా నటేష్, నిధి అగర్వాల్ ఎంత కావాలంటే అంత గ్లామర్ చూపించేశారు ఎలాంటి అభ్యంతరం లేకుండా. వీళ్లు వచ్చినప్పుడల్లా క్లీవేజ్ షో పుష్కలంగా కనిపిస్తుంటుంది. ఇక మిగిలిన పాత్రలు మామూలే. మొత్తమ్మీద ఇస్మార్ట్ శంకర్ చిత్రం పూరీ జగన్నాథ్ కి హిట్ అని చెప్పవచ్చు. ఐతే క్లాస్ ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :