పూరికి ఇస్మార్ట్ శంకర్ విషయంలో షాక్ ఇచ్చిన దిల్ రాజు... ఏమైంది..?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి... ప్రొడ్యూసర్ దిల్ రాజు షాక్ ఇచ్చాడట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇంతకీ విషయం ఏంటంటే... పూరి తెరకెక్కించిన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ హీరో రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించారు.
పూరి - ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. టీజర్‌కు ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. అయితే... ట్రైలర్‌కు మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే... ఈ సినిమాని నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చారట.
ధియేట్రికల్ రైట్స్ కాకుండా... మిగిలిన శాటిలైట్ & డిజిటిల్ రైట్స్‌కి బాగానే రేటు రావడంతో ఈసారి పూరికి లాభాలు ఖాయం అనుకున్నారు. ట్రైలర్‌కి మిక్స్‌డ్ టాక్ రావడం వలనో..లేక వేరే కారణమో తెలియదు కానీ... దిల్ రాజు నైజాంలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నో చెప్పాడట. ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి అందువలన మీ సినిమాని నేను రిలీజ్ చేయలేను అని చెప్పాడట. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కోసం చూస్తున్నారట పూరి, ఛార్మి.
అంతేకాకుండా.. ఆంధ్రాలో 10 కోట్లు వరకు రేటు వస్తుంది అనుకుంటే.. ట్రైలర్ ఎఫెక్టే ఏమో కానీ... 7 కోట్లకు ఇస్తామన్నా ముందుకు రావడం లేదట. టీమ్ మాత్రం సినిమా విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నారట. మరి... ఇస్మార్ట్ శంకర్ టీమ్ నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.