అన్నయ్యా... పాక్ పరిస్థితి ఏంటి? 36 ఓవర్లకి 204/2, 500 కొడ్తారా? సర్ఫరాజ్ మాటలకి ఫ్యాన్స్ స్టన్

Pakistan
ఫోటో కర్టెసీ-ఫేస్ బుక్
Last Updated: శుక్రవారం, 5 జులై 2019 (17:49 IST)
పాకిస్తాన్ జట్టుపై ట్రోలింగ్ మామూలుగా జరగడంలేదు. పంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ జట్టుతో ఆడుతున్న చివరి మ్యాచ్‌ ఇది. దేవుడు కరుణిస్తే ఈ ఆటలో 500 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తామంటూ పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వ్యాఖ్యలు చేయడంపై పాకస్తాన్ ప్రజలు షాక్ అవుతున్నారు.

ఐతే తాము మాత్రం ఎలాగైనా సెమీ ఫైనల్లోకి దూసుకు వస్తామని సర్ఫరాజ్ అంటున్నాడు. కాగా మ్యాచ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే పాకిస్తాన్ 36 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఇంకా 14 ఓవర్లు వున్నాయి. మరి సర్ఫరాజ్ లెక్క ప్రకారం ఈ ఓవర్లలో 296 పగులు చేయాలి. మరి చేస్తారో లేదో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.దీనిపై మరింత చదవండి :