శనివారం, 9 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Modified: శుక్రవారం, 5 జులై 2019 (15:04 IST)

పాక్ అనుకున్నట్లే ఆ 2 జరిగాయి... మిగిలిన రెండూ జరిగితే మేం సెమీస్ లోకే అంటున్న సర్ఫ్‌రాజ్

పాకిస్తాన్ ఎలాగైనా ప్రపంచకప్ 2019 సెమీఫైనల్లోకి ప్రవేశించాలని విపరీతంగా ఆలోచన చేస్తోంది. తాము అనుకున్నట్లే పాక్ జట్టు బంగ్లాదేశ్ పైన ఆడేందుకు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇది అనుకున్నట్లే జరిగింది. ఇకపోతే బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే ప్రపంచ కప్ పోటీల నుంచి నిష్క్రమించింది. పాకిస్తాన్ జట్టు మాత్రం ఆ రెండు కూడా చేస్తే తప్పక సెమీ ఫైనల్లోకి వెళ్తామని కలలు కంటోంది. 
 
పైగా పాకిస్తాన్ అధ్యక్షుడు, ఒకప్పటి క్రికెట్ పాక్ జట్టుకి పులుల్లా ఆడమని సలహా ఇచ్చారట. పాక్ జట్టు నెరవేర్చుకోవాల్సినవి 2 వున్నాయి. అది ఒకటి పాక్ జట్టు 50 ఓవర్లలో 400 పరుగులు చేయాలి, అలాగే బంగ్లాదేశ్ జట్టును 88 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఇలా చేస్తే పాక్ సెమీస్‌కి వెళ్లడం ఖాయం.
 
బంగ్లాదేశ్ జట్టు:
తమిమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకిబ్‌ అల్‌ హసన్, ముష్పికర్‌ రహీమ్‌, మహ్మదుల్లా, లిటన్‌ దాస్‌, మొసాదెక్‌ హుస్సేన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, మెహిదిహసన్‌, మష్రఫె మోర్తాజా(కెప్టెన్‌), ముస్తాఫిజర్‌ రహ్మాన్‌
 
పాకిస్థాన్‌ జట్టు:
ఫకర్ జమాన్‌,ఇమాముల్‌ హక్‌, బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ హఫీజ్‌, హారిస్ సోహైల్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), ఇమాద్‌ వసీం, షాదాబ్‌ఖాన్‌, వాహబ్‌ రియాజ్‌, మహ్మద్‌ ఆమీర్‌, షాహీన్‌ అఫ్రిది