ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (21:08 IST)

సుశాంత్ సోదరి మా మధ్య దూరాన్ని అలా పెంచేందుకు ప్రేరేపించేది.. రియా

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కారణమంటూ దివంగత నటుడి కుటుంబ సభ్యులు బీహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తన సోదరి ప్రవర్తనపై బాధపడుతూ తనతో చేసిన వాట్సాప్‌ చాట్‌ స్క్రీన్‌షాట్లను నటి రియా చక్రవర్తి షేర్‌ చేశారు. 
 
సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌ తన పట్ల వ్యవహరించిన తీరుపై సుశాంత్‌ కలత చెందాడని ఆ వాట్సాప్‌ చాట్‌ తేటతెల్లం చేస్తోందని రియా చెప్పారు. తమ మధ్య దూరం పెంచేందుకు సుశాంత్‌ రూమ్మేట్‌ సిద్ధార్ధ్‌ పిథానీనీ ప్రియాంక ప్రేరేపించేదని పలు వాట్సాప్‌ మెసేజ్‌ల్లో రియాతో సుశాంత్‌ పేర్కొన్నట్టు ఆ స్క్రీన్‌షాట్లలో ప్రస్తావించారు. 
 
కాగా రియా ఆరోపణలను సుశాంత్‌ మరో సోదరి శ్వేతా సింగ్‌ కీర్తి తోసిపుచ్చారు. ప్రియాంకతో పాటు తనతోనూ సుశాంత్‌ అన్యోన్యంగా ఉండేవారని చెప్పారు. ప్రియాంకతో తన అనుబంధంపై సుశాంత్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన వీడియోను శ్వేత షేర్‌ చేశారు. ఇలా రియాకు, సుశాంత్ కుటుంబ సభ్యుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.