సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (14:27 IST)

రితిక సింగ్ ప్యాన్ ఇండియా మూవీ ఇన్ కార్

Ritika Singh
Ritika Singh
జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్‌’. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా,  జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ట్రైలర్ లో కాలేజీకి వెళ్లే అమ్మాయి కిడ్నాప్ చేసి, ఏకాంత ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేయాలని గూండాలు ప్లాన్ చేస్తారు. ఆమె వారి నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఆమెను తీవ్రంగా గాయపరుస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఆమెకు పోరాటం తప్పా మరో మార్గం లేదు.
 
హర్ష వర్ధన్ తన గ్రిప్పింగ్ కథనంతో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ ఎంగెజింగా వుంది. రితికా సింగ్ ఎక్స్ టార్డినరీగా పెర్ఫార్మ్ చేసింది. నిజానికి అలాంటి పాత్రను అంగీకరించే దమ్ము ఉండాలి.
 ఈ చిత్రానికి మిథున్ గంగోపాధ్యాయ సినిమాటోగ్రఫీ, మానిక్ దివార్ ఎడిటర్. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను సునీల్ రోడ్రిగ్స్ పర్యవేక్షించారు. ఇన్ కార్ మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: రితిక సింగ్, సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా,  జ్ఞాన్ ప్రకాష్