మంగళవారం, 15 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2016 (08:35 IST)

భాష తెలియని వానరాలుగా ప్రవర్తిస్తున్నాం.. కావేరీ మంటలపై కమల్ హాసన్ ట్వీట్

కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు - కర్నాటక రాష్ట్రాల మధ్య చెలరేగిన ఘర్షణలపై తమిళ సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్ తనదైనశైలిలో స్పందించారు. నదీ జలాల కోసం ఘర్షణ పడటం, బస్సులు దగ్ధం చేయడం, ఒకరిపై ఒకరు దాడులు చేసు

కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు - కర్నాటక రాష్ట్రాల మధ్య చెలరేగిన ఘర్షణలపై తమిళ సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్ తనదైనశైలిలో స్పందించారు. నదీ జలాల కోసం ఘర్షణ పడటం, బస్సులు దగ్ధం చేయడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. 
 
'మనం భాష తెలియని వానరాలుగా ఉన్నప్పుడూ కావేరీ నది ప్రవహించింది. మానవుడిగా మారి నాగరికత నేర్చుకున్న తరువాతా ఆ నది ప్రవహిస్తూనే ఉంది. మనతరం ముగిసిన తర్వాత కూడా అది అలానే ప్రవహిస్తుంది. జరిగిన చరిత్రను ఆ నది చెబుతుంటే మనం మాత్రం ఘర్షణలకు పాల్పడటం సిగ్గుచేటు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
కాగా, కావేరీ జలాల చిచ్చుతో తమిళనాట రేగిన ఆందోళనలు బుధవారం సద్దుమణిగాయి. మరోవైపు తమిళనాడు రైతు సంఘాల సమాఖ్య, వ్యాపార సంఘాల సమాఖ్య శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వగా, పుదుచ్చేరిలో అదేరోజు బంద్‌కు వివిధ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. తమిళనాడు రాష్ట్రంలో పాటించనున్న బంద్‌కు మాత్రం ఒక్క అధికార అన్నాడీఎంకే మినహా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.