గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By mohan
Last Modified: గురువారం, 9 ఆగస్టు 2018 (18:22 IST)

గాయనీగాయకులకు కూడా రాయల్టీ

ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్- ఇస్రా బుధవారం నాడు హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు గాయకులు, ఇస్రా సీఈవో సంజయ్ టాండన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ 2012లో కేంద్రం అమల్

ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్- ఇస్రా బుధవారం నాడు హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు గాయకులు, ఇస్రా సీఈవో సంజయ్ టాండన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ 2012లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన రాయల్టీ చట్ట ప్రకారం పాటలపై వచ్చే ఆదాయంలో గాయనీ గాయకులకు కూడా వాటా ఉంటుందని పేర్కొన్నారు.
 
ఐపీఎల్ వంటి ఈవెంట్‌లలో పాడే పాటలకు సంగీత దర్శకుడు, గేయ రచయిత, నిర్మాత, ఆడియో హక్కులను కలిగిన కంపెనీలతో పాటు గాయనీ గాయకులకు రాయల్టీ చెల్లించాలని చట్టంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఇస్రా ద్వారా వారికి 50 ఏళ్ల పాటు రాయల్టీ చెల్లించే విధంగా నిబంధనలను రూపొందించారని తెలిపారు. ఈ చట్టం అమల్లోకి రావడం పట్ల పలువురు గాయకులు హర్షం వ్యక్తం చేసారు. గాయనీ గాయకుల్లో ఎవరైనా అనారోగ్యంతో మరణిస్తే, వారి కుటుంబసభ్యులకు ఆ రాయల్టీ మొత్తాన్ని ఇస్రా సంస్థ చెల్లిస్తుందని చెప్పారు. దీని ద్వారా గాయనీ గాయకులకు చక్కని భవిష్యత్తు ఉంటుందని, అలాగే వారు పాటపై పూర్తిగా హక్కును కలిగి ఉంటారని బాలు తెలిపారు.