'ఆర్ఆర్ఆర్' తాజా అప్డేట్ : అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లిమ్ప్స్..

Written By ఠాగూర్
Updated: సోమవారం, 1 నవంబరు 2021 (11:23 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. అలియాభట్, ఒలీవియా మొరీస్‌లు హీరోయిన్లు. 
 
ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ సునీలవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారి  సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్స్ విడుదలై భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా 'ఆర్ఆర్ఆర్' నుంచి గ్లిమ్ప్స్‌ను విడుదల చేశారు. ఇద్దరు స్టార్స్‌ను కలిపి ఈ గ్లిమ్ప్స్‌లో చూపించారు. ఇద్దరు హీరోలు తమదైన నటనతో పోటాపోటీగా నటించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ దసరాకే సినిమాను విడుదల చేయాలని తొలుత భావించినా కొన్ని అనివార్య కారణాలతో సినిమా విడుదలను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేశారు. 

 

అన్నీ చూడండి

ఢిల్లీ నీట్ నిరసనల కేసు: మైనర్లు, నేరాభియోగాలు లేనివారిని వదిలేయండి: సుప్రీంకోర్టు

Rahul Gandhi : ఇర్ఫాన్‌ను కలిసిన రాహుల్ గాంధీ- వీడియో వైరల్

అయ్యా, మా పరిస్థితి ఏంటి? స్కూల్లో పోరగాడు షేమ్ అయితుండు: సీఎం రేవంత్‌కి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు

అలలతో పోరాడి బాలుడిని లైఫ్ గార్డ్.. రాకాసి అలలతో పోరాడి.. (video)

డీఎస్సీ-2025 ప్రక్రియలో అవకతవకలు.. నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్

అన్నీ చూడండి

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments