శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (11:51 IST)

బ్రేకింగ్ : RRRనుంచి 5వ పాట విడుదల: కానీ సినిమా వాయిదా

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం కొత్త సంవత్సర కానుకగా రైజ్‌ ఆఫ్‌ రామ్‌ పేరిట ఓ పాటను విడుదల చేసింది. రామం రాఘవమ్‌ రణధీరం రాజసం... అంటూ అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ పాటలో అల్లూరి పాత్రలో రామ్‌ చరణ్‌ అద్భుతంగా కనిపించారు. 
 
ఈ పాటకు కె.శివశక్తి దత్త లిరిక్స్‌ అందించగా.. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. విజయ్‌ ప్రకాశ్‌, చందనా బాల కల్యాణ్‌, చారు హరిహరన్‌ బృందంగా ఈ పాటను ఆలపించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
కానీ ప్రస్తుతం అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ట్రిపుల్ ఆర్ టీమ్. నిజానికి ఆర్ఆర్ఆర్ 2020 జూలై 30న విడుద‌ల కావాల్సిన చిత్రం. అప్ప‌టి నుంచి వాయిదా ప‌డుతూనే వ‌స్తుంది. చివ‌ర‌కు జ‌న‌వ‌రి 7,2022న ఆర్ఆర్ఆర్ థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌ని అంద‌రూ ఫిక్స్ అయ్యారు. 
 
సినిమా యూనిట్ కూడా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక విడుద‌ల‌కు ప‌ది రోజులు కూడా లేవు. మ‌న అభిమాన హీరోల‌ను వెండితెర‌పై చూడొచ్చున‌ని ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నంద‌మూరి ఫ్యాన్స్ సంబర‌ప‌డ్డారు. కానీ.. ఇప్పుడు వారికి నిరాశ ఎదురుకాక త‌ప్పేలా లేదు. అందుకు కార‌ణం కోవిడ్ మ‌ళ్లీ త‌న పంజా విసర‌డం ప్రారంభించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలను కఠినతరం చేశారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుద‌ల చేస్తే డిస్ట్రిబ్యూట‌ర్స్ చాలా న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో చిత్ర యూనిట్‌, మేక‌ర్స్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌నలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే దాదాపు ఆరఆర్ఆర్ రిలీజ్‌ను వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యార‌ట‌. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.