శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (15:28 IST)

'విన్నర్' సెన్సార్ పూర్తి... ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికెట్ పొందడం విశేషం. ఇప్పటికే చిత్ర ట్రైలర్‌కు పాటలకు అద్భుత స్పందన వచ్చిన సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సైతం చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తడం మరో విశేషం. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మేమంతా ఊహించినట్టుగానే ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయింది. యు/ఏ సర్టిఫికెట్ పొందిన విన్నర్‌కు సెన్సార్ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. అని అన్నారు. 
 
సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముఖేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని.