శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (17:34 IST)

విరాటపర్వం తర్వాత మాట్లాడుతా.. నేను వుంటే అలా జరిగేది కాదు.. ?

Saipallavi virataparvam
గో రక్షకుల గురించి, 'ద కాశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు కంప్లయింట్ చేశారు. పోలీసులు హీరోయిన్ సాయిపల్లవిపై కేసు నమోదు చేసి వీడియో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సాయిపల్లవిపై కొందరు ట్రోల్ చేస్తున్నారు. కాగా, 'విరాటపర్వం' ప్రమోషన్స్‌లో ఈ వివాదంపై సాయిపల్లవి స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలకు డెఫినెట్‌గా సమాధానం చెప్తానని, కానీ, అందుకు సమయం ఇది కాదని స్పష్టం చేసింది.
 
తనను వివాదం నుంచి బయటకు తీసుకురావాలని అభిమానులు చూస్తున్నారని తను తెలుసని, అయితే, తనకు ప్రస్తుతం 'విరాట పర్వం' సినిమానే ముఖ్యమని తెలిపింది. 
 
పిక్చర్ రిలీజ్ అవుతున్న క్రమంలో తాను హ్యాపీగా ఉన్నానని , ఫిల్మ్ విడుదల తర్వాత తాను వివాదం గురించి మాట్లాడతానని స్పష్టం చేసింది. 
 
రానా ఈ విషయమై మాట్లాడుతూ తాను లేని టైంలో సాయిపల్లవితో మాట్లాడించారని, తాను ఉండి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని అన్నాడు. వివాదాల గురించి మాట్లాడాల్సిన సందర్భం కాదని వివరించాడు. 'విరాట పర్వం' చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరాడు.