ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత
తిరుమల ఏడుకొండలపై వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తిరుమలలో గోశాలలో ఆవులు చనిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండించారు. అసత్య ప్రచారంతో తితిదే ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
గోశాలలో 260 మంది సిబ్బంది గోసంరక్షణ పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సుమారు 2668 ఆవులకు జియోట్యాగ్ చేసి పర్యవేక్షిస్తున్నారని వివరించారు. భూమల కరుణాకర్ రెడ్డి తితిదే ఖజానాను దారి మళ్లించి కమీషన్లు కొట్టేశారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది ఆయనే. ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు భూమన కుట్ర చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.