భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)
తిరుమల కొండలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. తిరుమలలో హిమపాతంతో కూడిన కొండలు కనువిందు చేస్తాయి. నంది హిల్స్ లేదా నందిదుర్గ్, దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటకలోని ఒక కొండ కోట. 18వ శతాబ్దపు పాలకుడి వేసవి విడిది ప్రదేశం అయిన టిప్పు సుల్తాన్ కోటలో రాతి శిల్పాలు, గోడ చిత్రాలు ఉన్నాయి.
ఈ నంది హిల్స్ తరహాలో తిరుమల కొండలు మంచు దుప్పటి కప్పినట్లు కనువిందు చేస్తున్నాయి. ఇవి నంది హిల్స్ కాదని తిరుమల ఘాట్ రోడ్డు కొండలని వీడియో చూపెట్టడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
భూమిపై స్వర్గాన్ని తలపించేలా ఈ కొండలు దర్శనమిస్తున్నాయి. ఈ కొండల అద్భుతాన్ని వీక్షించేందుకు తిరుమలకు వెళ్లే భక్తులు వాహనాలను ఆపారు. ఆ సౌందర్య దృశ్యాలను తమ ఫోనుల్లో క్యాప్చర్ చేశారు.