దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? సాయిపల్లవిపై ఫైర్ అయిన విజయశాంతి
కాశ్మీర్ పండిట్లపై అకృత్యాలకు పాల్పడిన వారిని.. గోవధ కోసం ఆవుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని అడ్డుకోవడం కోసం గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయి పల్లవి పై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం…,తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని విజయశాంతి తెలిపారు.
నేడు మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లో కోట్లాదిమందికి చేరిపోతూ… ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో… సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలని విజయశాంతి వ్యాఖ్యానించారు.