మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (19:00 IST)

చిరంజీవిని కామెంట్ చేసిన సాయిప‌ల్ల‌వి!

Saipallavi dance
Saipallavi dance
ఇప్పుడు న‌టి సాయిప‌ల్ల‌వి హాట్ టాపిక్ గా మారింది. విరాట‌ప‌ర్వంలో ఆమె పాత్ర మీద‌నే సినిమా న‌డుస్తుంది. ఆమె డాన్స్‌కు ఫిదా అయిన వారు చాలామంది వున్నారు. ఆమె న‌ట‌న కూడా అలాంటిది. మెగాస్టార్ చిరంజీవే ఓ సంద‌ర్భంలో ఆమెను ప్ర‌శంసించారు. చిరుతో స్టేజీపై డాన్స్ కూడా వేసింది. ఇప్పుడు తాజాగా ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. 
 
సాయిప‌ల్ల‌వి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పెట్టింది. మెగాస్టార్ ముఠామేస్త్రిలో ఈ పేటకు నేనే మేస్త్రి సాంగ్ లో ఐకానిక్ స్టెప్ ని నేను చాలా సార్లు ట్రై చేశా,  కానీ చేయలేకపోయేదాన్ని. మ‌రో డాన్స్‌..నడక కలిసిన నవరాత్రి` సాంగ్ లో మెగాస్టార్ గ్రేస్ అయితే చాలా ఇష్టం. అలా ఎవరికీ రాదు అని చిరు డాన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.  ఇవి మెగా ఫ్యాన్స్ ను ఫిదాచేస్తున్నాయి.