మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (16:27 IST)

న‌గ్జ‌ల్స్ వెల్ ఎడ్యుకేటెడ్ - పోరాడే విధానంలో మార్పులున్నాయి - న‌వీన్ చంద్ర‌

Naveen Chandra
Naveen Chandra
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'విరాట పర్వం. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివ‌ల్యూష‌న్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్" అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రం జూన్ 17న థియేటర్‌లో విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఇందులో కీల‌క పాత్ర పోషించిన నవీన్ చంద్ర మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. 
 
విరాట‌ప‌ర్వంలో మీ పాత్ర ఎలా వుండ‌బోతోంది?
 
ఇది స‌గ్జ‌ల్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అంద‌మైన ప్రేమ‌క‌థ‌. చ‌క్క‌టి స్క్రిప్ట్‌తో ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో తీసిన చిత్ర‌మిది.వేణు, డానీగారు ఇక్క‌డ చాలా కేర్ తీసుకుని ఫారెస్ట్‌లో డెన్‌లు ఎక్క‌డెక్క‌డుంటాయో వాటన్నింటిలోకి వెళ్ళి తీశారు. యాక్ష‌న్ పార్ట్ అద్భుతంగా తీశారు. దీనికి ఫారిన్ యాక్ష‌న్ కొరియాగ్రాఫ‌ర్ స్టీఫెన్ రిచ్ బాగా డిజైన్ చేశారు. న‌న్ను ఇందులో ఎలా చూడ‌బోతున్నారంటే, నేను చేసే సినిమాల్లో పాత్ర‌ల ప‌రంగా వైవిధ్యంగా చేస్తున్నాను. కానీ ఈ విరాట‌ప‌ర్వం సినిమాలో నా పాత్ర క‌థ‌ను త‌ల‌కిందులుగా మార్చేస్తుంది. అన్నింటికంటే మా ఉద్య‌మాలు, పాల‌సీ ఇంపార్టెంట్‌. సాయిప‌ల్ల‌వి వెన్న‌ల పాత్ర పోషించింది. రానా, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య జ‌రిగే అంద‌మైన ప్రేమ‌క‌థ ఇందులో చాలా బాగుంటుంది. 
 
ఏయే ప్రాంతాల్లో షూట్ చేశారు.  అక్క‌డి అనుభ‌వాలు ఏమిటి?
వికారాబాద్ ఫారెస్ట్‌తో స‌హా మూడు ఫారెస్ట్‌ల‌లో షూట్ చేశాం. లొకేష‌న్‌లో అంద‌రూ న‌గ్జ‌ల్స్ డ్రెస్‌లో వుంటారు. పూర్తిగా న‌గ్జ‌ల్స్ వాతావ‌ర‌ణం నెలకొంది. ఇందులో నేను ర‌ఘ‌న్న అనే ఉద్య‌మకారుడిగా న‌టించాను. త‌ను ఏదైనా వుంటే నిక్క‌చ్చిగా చెప్ప‌డం, త‌గిన విధంగా ప‌నులు చేయ‌డం జ‌రుగుతుంది. సీనియ‌ర్ ఉద్య‌మ‌కారుడిని. ఈ ఆవేశం వ‌ల్ల సీనియ‌ర్ ఉద్య‌మ‌కారుడినుంచి జూనియ‌ర్ స్థాయికి దిగిపోతాను. ఆ ఈర్ష‌తోనే ఇక్క‌డ గ్రూప్‌లో ప‌నిచేస్తుంటాను. ర‌వ‌న్న అనే న‌గ్జ‌ల్ గా రానా గారు న‌టించారు. బార‌త‌క్క‌గా ప్రియ‌మ‌ణి న‌టించారు. ర‌వ‌న్న‌, ర‌ఘున్న‌, బార‌త‌క్క ఈ ముగ్గురు మ‌ధ్య జ‌రిగే జ‌ర్న‌రీలో ల‌వ్ స్టోరీ. 
న‌గ్జ‌ల్స్ డైలాగ్‌లకు ప్రిప‌రేష‌న్ అయ్యారా?
ద‌ర్శ‌కుడు వేణు డైలాగ్స్ ప్ర‌త్యేకంగా వుంటాయి. తెలంగాణ నేప‌థ్యం క‌నుక ఆ యాస‌తో మాట్లాడాలి. వాటిని ప‌ల‌క‌డం నాకు కొత్త‌గా అనిపించింది. ఇంత‌కుముందు అర‌వింద‌స‌మేత‌లో ఈజీగా చేశాను. కానీ ఇందులో యాక్సెంట్ క‌ష్టంగా వుంటుంది. సాధార‌ణంగా ఉద్య‌మ‌కారుడు మాట్లాడే భాష మ‌నం మాట్లాడ‌డం అంత ఈజీగాదు. సాహిత్యంతో కూడుకుంటుంది. అందుకే వేణుగారు చాలా కేర్ తీసుకున్నారు. నేనుకానీ, సాయిప‌ల్ల‌వికానీ, రానా ద‌గ్గుబాటిగారుకానీ బాష‌ను ప్రోప‌ర్‌గా చెప్పేలా చేశారు.  అక్క‌డ అరుస్తూ మాట్లాడితే ఏనుగులు వ‌చ్చేస్తాయి. అందుకే చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడాల్సివ‌చ్చింది.
నేను ఈ సినిమా చేయ‌డానికి కార‌ణం.. ఇలాంటి క‌థ‌లు అరుదుగా వ‌స్తుంటాయి. ట్రూ బేస్డ్ ఫిలిం. వ‌రంగల్ బేస్డ్ క‌థ‌. వేణుగారు ఫీల్ అయింది. చూసిన క‌థ‌. ఆయ‌నకు బాగా తెలిసిన ఇటువంటి క‌థ‌లో న‌టించ‌డం గొప్ప అవ‌కాశం భావిస్తున్నా. అలాగే సాయిప‌ల్ల‌విగారితో న‌టించ‌డం గొప్ప‌గా అనిపించింది. ఆమె మంచి పెర్‌ఫార్మ‌ర్‌. మాన‌వ‌త్వం క‌లిగిన ఆమె. ఈ పాత్ర‌ల కోసం అంద‌రికీ వ‌ర్క్‌షాప్ జ‌రిగింది. గ‌న్స్ ఎలాప‌ట్టాలి?   కొన్ని బాంబ్ బ్లాస్ట్‌లు వున్నాయి. అప్పుడు ఏం చేయాల‌నేవి. వేణుగారు ప‌క్కాగా శిక్ష‌ణ ఇచ్చారు. మేం లొకేష‌న్‌కు వెళ్ల‌డానికే ముందుగానే ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌, డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌, నిర్మాత‌లు వెళ్ళి ప‌రిశీలించి వ‌చ్చేశారు. లొకేష‌న్లో అంబులెన్సులుకూడా వుండేవి. క‌రోనా టైంలో శానిటైజ‌ర్లు, తగు జాగ్ర‌త్త‌లు తీసుకుని చేయించారు. న‌గ్జ‌ల్స్ పాత్ర‌ప‌రంగా నేను ఆహార్యాన్ని మార్చుకున్నాను.అందుకు త‌గిన‌విధంగా చేశాను.
 
ఏ ద‌ర్శ‌కుడికి అయినా న‌వీన్‌చంద్ర ఛాయిస్‌గా మారారు. దీనికి మీరేమంటారు?
అది అదృష్టం గా భావిస్తున్నా. నేను హీరోగా చేశాను. ఆ త‌ర్వాత ఇటువంటి పాత్ర‌లు ద‌ర్శ‌కులు ఎంచుకుంటున్నారంటే ఇంత‌కుముందు నేను చేసిన వ‌ర్క్ వ‌ల్ల‌నే. సినిమా టు సినిమాకు మంచి పాత్ర‌లు రావ‌డం కూడా గాడ్‌గ్రేసే. ఇలా పాత్ర‌లు ఇస్తున్న ద‌ర్శ‌కుల‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నా. ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు వారు రోజుల త‌ర‌బ‌డి రాసుకున్న పాత్ర‌ను మాకు ఇస్తుంటారు. దానికి న్యాయం చేయాలి.
 
ఓటీటీ ఫ్లాట్ ఫాం మిమ్మ‌ల్ని బాగా ఉప‌యోగించుకుందే?
(న‌వ్వుతూ) న‌న్ను ఉప‌యోగించుకోవ‌డం కాదు. నేను ఓటీటీని ఉప‌యోగించుకున్నా. సినిమా త‌ర్వాత గేప్ వ‌చ్చినా, క‌రోనా వ‌ల్ల ఆర్టిస్టుల స్టేట్ ఆఫ్‌మైండ్ గంద‌ర‌గోళంగా వుంటుంది. క‌రోనా టైంలో బెస్ట్ అవ‌కాశం ఓటీటీ. అందుకే చేసేశాను.
 
ఆ సినిమాలు వెండితెరపై వుంటే బాగుండేద‌నిపించిందా?
అవును. చాలా బాగుండేది. కానీ అది నిర్మాతల ఛాయిస్‌. నామీద ఇన్‌వెస్ట్‌ చేసేట‌ప్పుడు నిర్మాత‌లకు హ‌క్కులుంటాయి. లాక్‌డౌన్‌లో కొన్ని సినిమాలు ఓటీటీలో చేశాను. అందులో కొన్ని థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌రాయి. నేను వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నా. 
 
న‌గ్జ‌ల్స్ గురించి తెలుసుకున్నారా?  పాత్ర‌ప‌రంగా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు?
నేను అందాల రాక్ష‌సి త‌ర్వాత `ద‌ళం` సినిమా చేశాను. అప్పుడే న‌గ్జ‌ల్స్‌పై అన్ని విష‌యాలు తెలుసుకున్నా. విరాట‌ప‌ర్వం చిత్రానికి నా బాడీని చాలా మార్చుకున్నాను. ఫిట్‌గా త‌యారుకావ‌డానికి క‌స‌ర‌త్తులు చేశాను. నేను, సాయిప‌ల్ల‌వి, రానా ఒక సింగిల్ షాట్‌లో గ‌న్ ప‌ట్టుకుని కొండ‌ల‌మీద ప‌రుగెత్తాలి. ఏదైనా తేడా వ‌స్తే మ‌ర‌లా చేయాల్సివ‌స్తుంది. మ‌ర‌లా ప‌రుగెత్తాలి. అందుకే ఫిట్‌గా మారాను. అలాగే డైలాగ్స్‌కూడా యాస‌లో వుండాలి. ద‌ర్శ‌కుల టీమ్‌తో కూర్చుని ఆ యాస‌ను నేర్చుకున్నాను. అస‌లు న‌గ్జ‌ల్స్ అంద‌రూ వెల్ ఎడ్యుకేటెడ్‌. హ్యూమానిటీ కూడా వుంటుంది. కానీ విప్ల‌వం అనేది ప్ర‌భుత్వంపైనా కొంద‌రిపైనా చేస్తుంటారు. ఇందులో డైలాగ్‌లు వేణుగారు ఫీల‌యి చాలా డెప్త్‌లో రాశారు. 
 
సాయిప‌ల్ల‌వి పాత్ర ఎలా వుంటుంది?
అస‌లు సినిమా మొత్తం వెన్నెల పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మేం స‌పోర్టింగ్ పాత్ర‌ల‌మే. ఆమె మంచి పెర్‌ఫార్మ‌ర్‌. మంచి మాన‌వ‌త్వం వున్న మ‌నిషి.
 
వ్య‌క్తిగ‌తంగా ఎలా వుండాల‌నుకుంటారు?
ఈ క్ష‌ణం ఇక్క‌డ ఇలా హాయిగా వున్నాను. అలాగే అన్ని సంద‌ర్భాల్లోనూ వుండాల‌నుకుంటాను. మ‌నం ఫ్రీడంగా వుండాల‌నేది ప్ర‌పంచంలోనే వుంది. వాటినుంచి మ‌నం ఫ్రీడం తీసుకోవ‌డ‌మే.
 
నెగెటివ్ పాత్ర‌లే ఎక్కువ‌గా వ‌స్తున్నాయా?
ల‌క్కీగా అలా రావ‌డంలేదు. అర‌వింద స‌మేత త‌ర్వాత `గ‌ని` సినిమాలో నెగెటివ్ చేశాను. చివ‌రిలో పాజిటివ్‌గా మారిపోతాను. నెగెటివ్ చేస్తే ఫుల్‌గా ఎక్‌ట్రీమ్‌లో చేయాలి. రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో నెగెటివ్ పాత్ర‌ చేస్తున్నాను. క‌థ‌కు ట్విస్ట్‌, ఛేంజ్ వ‌చ్చే పాత్ర‌లే నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి. ఇమేజ్ కోసం మాత్రం చేయ‌డంలేదు.
 
రానాతో న‌టించ‌డం ఎలా అనిపించింది? 
ఆయ‌న ఆజానుబ‌హుడిలావుంటాడు. కానీ చిన్న పిల్లవాడిలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడు. సెట్లో జోవియల్ గా వుంటాడు.ఆయ‌నది సినిమా ప్ర‌పంచం. ఆయ‌న‌కు అన్ని విష‌యాలు తెలుసు. ఆయ‌న ఓ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ బాక్స్‌.. 
 
కొత్త చిత్రాలు?
నాలుగు సినిమాలు వున్నాయి. 'అమ్ము' (అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్), ఒక యువి కాన్సెప్ట్ ఫీచర్ ఫిల్మ్, తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్, మరియు 'పరంపర 2' (డిస్నీ + హాట్స్టార్ వెబ్ సిరీస్) నా రాబోయే రీలేస్లలో ఉన్నాయి. 'భానుమతి రామకృష్ణ' ఫేమ్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎఫ్ టిఐఐ పూర్వ విద్యార్థులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. టెక్నికల్ అవుట్ పుట్ సూపర్బ్ గా ఉండబోతోంది. అలాగే బాల‌కృష్ణ‌, మ‌లినేని గోపీచంద్ సినిమా చేస్తున్నా.
 
అందులో ఏ త‌ర‌హా పాత్ర చేస్తున్నారు?
బాల‌కృష్ణ‌గారి చిత్రంలో ఐదు పిల్ల‌ర్ పాత్ర‌లుంటే అందులో ఒక‌టి అవ్వాల‌నుకుంటాను. ఇందులోనూ ట్విస్ట్ వ ఉండే పాత్రే. అస‌లు బాల‌య్య‌బాబుతో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా వుంది. ఆయ‌న ఎన‌ర్జీకి హ్యాట్సాప్‌. స‌మ‌య‌పాల‌న‌, మెమెరీకి అభినంద‌లు. చాలా క‌లిసిపోతుంటారు.
 
మ‌రి ఇన్ని సినిమాలు డేట్స్ ఎలా ఎడ్జ‌స్ట్ అవుతున్నాయి?
ప్ర‌తి సినిమాకు క్లాష్ రాకుండా స‌రిచూసుకుంటున్నాను. బాల‌కృష్ణ‌గారి సినిమాకు, శంక‌ర్ గారి సినిమాకి డేట్స్ క్లాస్ అయ్యాయి. నాకు ప్రొడ‌క్ష‌న్ వారు స‌హ‌క‌రించారు. మా మేనేజ‌ర్ రాజా ర‌వీంద్ర అవ‌న్నీ జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నారు.