బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (17:52 IST)

కేజీఎఫ్ 2కి.. సలార్‌కి సముద్రంతో లింక్.. ఎలా?

salaar movie still
ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ నుంచి ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే 'సలార్' పై భారీ అంచనాలు ఉన్నాయి.
 
'కేజీఎఫ్ 2' సినిమాలో క్లైమాక్స్‌కి కథ సముద్రం పైకి చేరుకుంటుంది. అలాగే 'సలార్' సినిమా క్లైమాక్స్ కూడా సముద్రంపైకి చేరుకుంటుందని టాక్. సముద్రం లోపల ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్ వస్తోంది. ఈ సీన్ కోసం భారీగా వెచ్చించనున్నారు.
 
ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ముఖ్యమైన పాత్రలలో జగపతిబాబు ..   పృథ్వీరాజ్ సుకుమారన్ .. ఈశ్వరీరావు కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.