1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (13:04 IST)

ఐఫోన్ మెసెంజర్‌ కొత్త వెర్షన్‌లో సల్మాన్ ఖాన్ ఎమోజీ.. దేశంలో ఫస్ట్ టైమ్

టెక్నాలజీ పెరిగిపోతోంది. లేటెస్టు ఫోన్లు, కొత్త కొత్త వెర్షన్లు వచ్చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటే ఐఫోన్ మెసెంజర్‌ అనే యాపిల్ కొత్త వెర్షన్. ఇందులో ఇండియాకు సంబంధించిన కొత్త కొత్త స్టిక్కర్స్ రూపొంది

టెక్నాలజీ పెరిగిపోతోంది. లేటెస్టు ఫోన్లు, కొత్త కొత్త వెర్షన్లు వచ్చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటే ఐఫోన్ మెసెంజర్‌ అనే యాపిల్ కొత్త వెర్షన్. ఇందులో ఇండియాకు సంబంధించిన కొత్త కొత్త స్టిక్కర్స్ రూపొందించింది. ఇందులో బాలీవుడ్ స్టార్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఎమోజీ ఉండటం విశేషం. ఈ ఎమోజీలను అమెరికన్ డెవలప్ చేశాడు. Ios 10లో మెసేజ్ రిప్లయ్‌లో కొత్తగా ఫొటోలు, వీడియోలు పంపించుకునే ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. 
 
ఓ బాలీవుడ్ స్టార్‌ను మొబైల్ ఫోన్లలో ఎమోజీగా తీసుకురావటం దేశంలోనే ఇదే మొదటి సారి. బీయింగ్ సల్మాన్ పేరుతో ఈ ఎమోజీలు ఉన్నాయి. సల్మాన్ తోపాటు.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి స్లోగన్స్, హావభావాలతో కొత్త స్టిక్కర్స్ విడుదల చేసింది.
 
ఇదిలా ఉంటే.. ఐఫోన్ వినియోగ‌దారులు ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్ల‌స్ మోడ‌ల్స్ అక్టోబ‌ర్ 7 నుంచి భార‌త వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లువురు డిస్ట్రిబ్యూట‌ర్లు ఇప్ప‌టికే ఆయా ఫోన్ల కోసం ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించేశారు.