రమేష్ వర్మకు సల్మాన్ ఆఫర్
తెలుగు సినిమా దర్శకుడు రమేష్ వర్మ చేసింది కొద్ది సినిమాలే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తమిళ సినిమా రీమేక్‌గా `రాక్షసుడు` తీశాడు. ఇప్పుడు తాజాగా రవితేజతో `ఖిలాడి` చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా ముగింపు దశకు చేరుకోలేదు. కోవిడ్ వల్ల ఆలస్యమైంది. కానీ, ఇటీవలే విడుదలై ఖిలాడి టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అది బాలీవుడ్ వరకు వెళ్ళింది. ఆ టీజన్‌ను చూసిన కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఎంతగానో మెచ్చుకున్నారట. ఖిలాడీ రీమేక్ హక్కులు కొనుగోలు చేశాడట. రవితేజ చేసిన ఖిలాడీని హిందీలో తాను చేయాలని అనుకున్నాడు. అందుకు రమేష్‌వర్మకు ఆహ్వానం పలికాడు.
ఖిలాడి సినిమాను త్వరితగతిన పూర్తిచేసే పనిలో వున్నాడు రమేష్‌వర్మ. ఇప్పటికే బాలీవుడ్‌లో అజయ్‌దేవ్‌గన్‌తో `రాక్షసుడు` రీమేక్ చేయబోతున్నాడు. అందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఆ తర్వాత నాగచైతన్యతో పాన్ ఇండియా మూవీగా రొమాంటిక్ లవ్‌స్టోరీని తీయనున్నాడట. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో కూడా సినిమా చేయనున్నాడని ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా సినిమా సినిమాకూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రమేష్‌వర్మ బాలీవుడ్‌లోకి వెల్ళడం మంచి పరిణామమే అంటున్నారు సినీజనాలు.