ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 జనవరి 2021 (21:44 IST)

సమంత 'శాకుంతలం'... గుణశేఖర్ మరో అద్భుత దృశ్యరూపం

దర్శకుడు గుణశేఖర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. సబ్జెక్టులో డెప్తుతో చిత్రాన్ని తీస్తుంటారు. పౌరాణిక చిత్రం రుద్రమదేవి చిత్రాన్ని అనుష్కతో తీసి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు.
 
లేడీ సూపర్ స్టార్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సమంత అక్కినేని శకుంతలగా నటించనుంది. శకుంతల-దుష్యంత మహారాజు ప్రణయ గాధను ఆయన తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు సమంత అక్కినేని ధన్యవాదాలు తెలిపింది.
 
శకుంతలకు సమంత అక్కినేని నటిస్తోంది. ఐతే దుష్యంత మహారాజుగా ఎవరు నటిస్తారన్నది గుణశేఖర్ తెలుపలేదు. ఆ పాత్రలో ఎవరైతే బావుంటారో మీరు కూడా ఊహించుకోండి మరి.