శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 7 మే 2018 (16:11 IST)

క్యాస్టింగ్ కౌచ్‌పై ఘాటు సమంత.. పెళ్ళైంది.. పిల్లలు పుట్టినా నటిస్తూనే వుంటా..

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై ఆందోళనలు చేసిన నేపథ్యంలో.. ఈ వివాదంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై అక్కి

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై ఆందోళనలు చేసిన నేపథ్యంలో.. ఈ వివాదంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై అక్కినేని నాగార్జున కోడలు, హీరోయిన్ సమంత స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదని సమంత స్పష్టం చేసింది.
 
అంతేగాకుండా అన్నీ రంగాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ వుందని తెలిపింది. అమ్మాయిల బలహీనతలను వాడుకునే నీచులు ప్రతి చోటా ఉన్నారని వెల్లడించింది. తాను నటించిన తొలి సినిమానే హిట్ కావడంతో, ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం తనకు రాలేదని సమంత స్పష్టం చేసింది. 
 
గత ఎనిమిదేళ్ల పాటు టాలీవుడ్, కోలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. తనకు అలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదని సమంత చెప్పుకొచ్చింది. తనకు ఒక అందమైన జీవితాన్ని ఈ పరిశ్రమ ఇచ్చిందని... అందుకే పిల్లలు పుట్టిన తర్వాత కూడా నటించాలని తాను అనుకుంటున్నానని సమంత తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఒక్క సినిమా ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేయడం మంచిది కాదు. 
 
అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హిట్, ఫ్లాప్‌లు అనేవి చాలా కీలకమని సమంత తెలిపింది. చాలామంది ఇండస్ట్రీలో ఏదో జరిగిపోతుందని అంటున్నారని.. చెడును ఎక్కువగా ప్రచారం చేస్తున్నారన్నారు. మంచి చెడులు ఎక్కడైనా ఉంటాయని సమంత వెల్లడించింది. తనకు ఈ ఇండస్ట్రీ గొప్ప జీవితాన్ని ఇచ్చిందని.. నాకు పిల్లలు పుట్టినా.. సినిమాలు మాత్రం వదిలే ప్రసక్తే లేదని సమంత చెప్పుకొచ్చింది. ఈ జర్నీ చాలాకాలం పాటు కొనసాగాలనుకుంటున్నట్లు సమంత వెల్లడించింది.