శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (10:23 IST)

సమంత పుట్టినరోజు పార్టీ పొదుపు చూసి షాక్ అయిన నాగార్జున..!

సమంత పుట్టినరోజు పార్టీ గ్రాండ్‌గా జరిగింది. తన పుట్టినరోజుకు వచ్చిన సన్నిహితుల కోసం నాగచైతన్య సమంతలు స్వయంగా కొన్ని డిషస్ వండి వారికి సర్వ్ చేసిన సంగతి తెలిసిందే. సమంత పుట్టినరోజు లెక్కల స్ట్రాటజీకి

సమంత పుట్టినరోజు పార్టీ గ్రాండ్‌గా జరిగింది. తన పుట్టినరోజుకు వచ్చిన సన్నిహితుల కోసం నాగచైతన్య సమంతలు స్వయంగా కొన్ని డిషస్ వండి వారికి సర్వ్ చేసిన సంగతి తెలిసిందే. సమంత పుట్టినరోజు లెక్కల స్ట్రాటజీకి నాగార్జున కూడా షాక్ అయ్యాడు. దీనికి కారణం సమంత తన పుట్టినరోజు విషయంలో అనుసరించిన వ్యూహాత్మకమైన పొదుపేనని చెప్తున్నారు. 
 
విదేశాల్లో మాస్టర్ డిగ్రీ చేసి టాలీవుడ్ సినిమా రంగంలో హీరోగా ఎదగడమే కాకుండా ఎన్నో విజయవంతమైన వ్యాపార సంస్థలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు నాగార్జున. అదేవిధంగా ఓ సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సమంత స్టార్ హీరోయిన్‌గా ఎదగకముందు తాను చదువుకున్న డిగ్రీ సబ్జెక్టులోని ఎకనామిక్స్‌లో వచ్చిన మార్కులన్నీ డిస్టింక్షనే అనే విషయాన్ని సమంత అనేక సార్లు చెప్పింది.
 
తను సంపాదించే డబ్బులను బాగా ఇన్వెస్ట్ చేయడం దగ్గర నుండి ఒక చారిటీ ఆర్గనైజేషన్ నడపడం వరకు సమంత వేస్తున్న వ్యాపార అడుగులు అక్కినేని కోడలుగా నూటికి నూరు పాళ్ళు నిరూపించుకునే విధంగా ఉంటున్నాయని టాక్ వచ్చింది. 
 
అసలు విషయం ఏంటంటే..? సమంత బర్త్ డే పార్టీని పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ళో కాకుండా.. చక్కగా ఇంటి దగ్గరే తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేసింది. పొదుపు విషయంలో సమంత పాటిస్తున్న నియమాలు అన్నీ నాగార్జున ఇంటి కోడలుగా సరితూగేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కూడా సమంత బర్త్ డే పార్టీకి పెట్టిన ఖర్చు చూసి షాక్ అయ్యాడట.