శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (22:19 IST)

సిటాడెల్: అక్కడ ప్రియాంకా చోప్రా.. ఇక్కడ సమంత ప్రభు!?

Samantha Ruth Prabhu
సిటాడెల్ కొత్త వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌ను హాలీవుడ్ చిత్రనిర్మాతలు రుస్సో బ్రదర్స్ మొదట అమెరికన్ టీవీ వీక్షకుల కోసం ఉద్దేశించి రూపొందించారు. ఈ అమెరికన్ టెలివిజన్ సిరీస్‌లో, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
 
తాజాగా ఆమె గూఢచారి సిరీస్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. నాడియా సిన్ అనే ఏజెంట్ పాత్రలో ప్రియాంక చోప్రా నటించింది. 
 
ఈ సిరీస్ హిందీలో కూడా రీమేక్ అవుతోంది. వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించారు. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే చిత్రీకరిస్తున్నారు. 
priyanka chopra
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
 
ఇంటర్నేషనల్ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను సమంత పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఇంకేముంది.. సమంత భారతీయ ప్రేక్షకుల కోసం, ప్రియాంక చోప్రా గ్లోబల్ ప్రేక్షకుల కోసం అదరగొట్టారన్నమాట.