గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (17:12 IST)

గుర్రపు స్వారీ చేస్తోన్న సమంత.. పిక్ వైరల్

Samantha
Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం సమంత గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఏడేళ్ల క్రితం శిక్షణ పొందింది. తాజాగా ఒక ఎరీనాలో గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.
 
ఆమె చిత్రానికి లవ్ ఎమోజీ తప్ప ఎలాంటి క్యాప్షన్‌లను జోడించలేదు. ఆమె ఇటీవల తక్కువ సమాచారంతో చిత్రాలను పోస్ట్ చేస్తోంది. ఆమె తన వెబ్ సిరీస్ సిటాడెల్ కోసం శిక్షణలో భాగంగా గుర్రపు స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
 
సమంత త్వరలో తన తెలుగు సినిమా ఖుషిని మళ్లీ ప్రారంభించనుంది. ఈ చిత్రంలో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి నటించనున్న సంగతి తెలిసిందే.