సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (10:42 IST)

వరలక్ష్మి శరత్ కుమార్‌ సినిమాకు సమంత సపోర్ట్

Samantha
కొండ్రాల్ పావం అనే కోలీవుడ్ మూవీతో వరలక్ష్మి శరత్‌కుమార్ రాబోతోంది. సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో రాబోయే ఈ తమిళ చిత్రాన్ని దయాళ్ పద్మనాభన్ రూపొంచారు. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది 1981వ సంవత్సరం నేపథ్యంలో సాగుతుంది. 
 
ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్ పట్ల సమంత సానుకూలంగా స్పందించింది. తాజా చిత్రం మోహన్ హబ్బు రాసిన ప్రసిద్ధ కన్నడ నాటకం ఆ కరాలా రాత్రి ఆధారంగా రూపొందించబడింది. 
 
గతంలో కన్నడలో చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు దయాళ్ పద్మనాభన్, 2018లో కన్నడలో ఆ కరాల రాత్రి అనే నాటకాన్నితెరకెక్కించారు. 
 
ఇది అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. ఆ చిత్రాన్ని తెలుగులో అనగనగా పేరుతో రీమేక్ చేశారు. దీని ఆధారంగా తమిళంలో కొండ్రాళ్ పావం అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు