శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (17:19 IST)

అక్కినేని వారి పెళ్లిపిలుపు : మా పెళ్లికి రండి అంటున్న నాగచైతన్య.. పెళ్లెప్పుడంటే...

అక్కినేని ఇంటి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్టోబర్ ఆరో తేదీన అక్కినేని నాగా చైతన్య, హీరోయిన్ సమంతల పెళ్లి వేడుక జరుగనుంది. ఈ వివాహమహోత్సవానికి సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవా వేదికకానుంది. ఈ విషయాన్న

అక్కినేని ఇంటి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్టోబర్ ఆరో తేదీన అక్కినేని నాగా చైతన్య, హీరోయిన్ సమంతల పెళ్లి వేడుక జరుగనుంది. ఈ వివాహమహోత్సవానికి సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవా వేదికకానుంది. ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. 
 
టాలీవుడ్ ప్రేమ జంటగా ఉన్న చైతూ, సమంతలు పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాగా, ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతం తెలిపారు. దీంతో వారిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, వివాహం తేదీపై ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో అక్టోబరు ఆరో తేదీన తమ వివాహం జరుగుతుందని నాగచైతన్య గురువారం స్వయంగా ప్రకటించారు.