గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (16:53 IST)

వైవాహిక జీవితం విచ్ఛిన్నమైన బాధ నుంచి ఇంకా కోలుకోలేదు : సమంత (video)

samantha
తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైన బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేకపోతున్నట్టు హీరోయిన్ సమంత అన్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "శాకుంతలం". గుణశేఖర్ దర్శకుడు. ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సమంత జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలపై కూడా స్పందించారు. 
 
వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడంపై ఆమె స్పందిస్తూ, అవి చీకటి రోజులని వ్యాఖ్యానించారు. ఆ బాధ నుంచి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పారు. క్లిష్టమైన పరిస్థితులు ఎదురుకావడంతో మానసికంగా ఎంతో వైదనకు గురయ్యానని చెప్పారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవన్నారు. 
 
అయితే, ఆ కష్టకాలంలో కుటుంబ సభ్యులు, స్నహితులు, వెన్నంటి వున్నారని చెప్పారు. వాళ్ల అండదండలు లేకపోతే ఇపుడిలా ఉండేదాన్ని కాదని సమంత చెప్పారు. నాకు మంచి రోజులు వస్తాయా? అని మా అమ్మను రోజూ అడుగుతుండేదాన్నని గుర్తు చేశారు. బాధలు ఎప్పటికీ ఉండిపోవని, అయితే, బాధలను ఎదుర్కొన్నపుడే మనలో ధైర్యం పెరుగుతుందని చెప్పారు.