మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (08:02 IST)

సంగీత్ శోభన్ ప్రేమ విమానం

Prema Vimana opening
Prema Vimana opening
శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మాణంలో సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నూతన చిత్రం' ప్రేమ విమానం' ఈరోజు లాంఛనంగా పూజాకార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివే శానికి ఏషియన్ గ్రూప్స్ భరత్ నారంగ్ క్లాప్ ఇవ్వగా, సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించగా, గీతా ఆర్ట్స్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు.
 
న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాన్వే మేఘన కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. కల్పలత, సుప్రీత్, శైలజ ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, జగదీష్ చీకటి డీవోపీ గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తారాగణం: సంగీత్ శోభన్, సాన్వే మేఘన,  కల్పలత, సుప్రీత్, శైలజ ప్రియ