శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జులై 2022 (19:35 IST)

అర్జున్ రెడ్డి ముద్దుల స్టోరీ.. షాలీనీ పాండే ఏం చెప్పిందంటే? (Video)

Shalini Pandey
టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించగా అతని సోదరుడు నిర్మాతగా వ్యవహరించాడు.
 
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక హీరోయిన్ షాలినీ పాండేని విజయ్ పెదవి ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉన్న పోస్టర్‌ను వదిలారు. 
 
ఈ పోస్టర్ బస్సులపై కూడా అంటించి గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. అయితే, ఇలాంటి పోస్టర్స్ ఏంటీ సినిమాలు ఎలాంటివి తీస్తున్నారు..సమాజాన్ని సినిమావాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు..అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే.
 
అదే అర్జున్ రెడ్డి సినిమాకు పెద్ద పబ్లిసిటీ అయి అనూహ్యంగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
 
ఈ సినిమాలో మసాలా సన్నివేశాలు..ఘాటు ముద్దులు..రొమాన్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చూపించడంతో అన్నీ వర్గాల ప్రేక్షకులకు అర్జున్ రెడ్డి సినిమా కనెక్ట్ అయింది.  
 
ఈ సినిమాలో ఇన్ని ముద్దులు ఉంటాయని మీకు ముందే తెలుసా..? అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు షాలినీ ఇచ్చిన సమాధానం షాకింగ్‌గా ఉంది.
 
నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు లిప్ కిస్ ఉంటుందని..రొమాంటిక్ సీన్స్ ఉంటాయని చెప్పారు. అయితే, ఇన్ని కిస్సులుంటాయని హీరోతో పెదవి ముద్దులు చాలా ఉంటాయని చెప్పలేదు.
 
నిజంగా సినిమాకి ముందు ఇలా ఎక్కువ ముద్దులు పెట్టాల్సి ఉంటుందీ అంటే గనక ఒప్పుకునేదాన్ని కాదేమో. కానీ, అర్జున్ రెడ్డి సినిమా ఎప్పటికీ నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అని చెప్పింది. అప్పట్లో షాలినీ పాండే చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.