గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 మే 2021 (19:23 IST)

త్రివిక్రమ్ సినిమాలు సీనియర్ హీరోయిన్?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరెకెక్కనుంది. ఇందులో నటీనటుల ఎంపిక కోసం ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ఈ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా, ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. 
 
ఇక ఒక కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కథను ఒక అనూహ్యమైన మలుపు తిప్పే ఈ పాత్ర కోసం సీనియర్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని భావించి, శిల్పా శెట్టి అయితే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో కీలకమైన పాత్రలకు సీనియర్ స్టార్ హీరోయిన్లను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో అత్తారింటికిదారేది చిత్రంలో కూడా నదియను తీసుకున్నారు. 
 
అలాగే, ఖుష్బూ, దేవయాని, టబూ, స్నేహా కనిపించారు. ఈ సారి శిల్పా శెట్టిని రంగంలోకి దింపనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తెలుగులో హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో అలరించిన శిల్పా శెట్టి, ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది.