శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (17:48 IST)

మద్యం సేవించి అడ్డంగా బుక్కైన ఎస్ఎస్.రాజమౌళి కుమారుడు?

మద్యం సేవించి వాహనం నడపొద్దని పదేపదే ట్రాఫిక్ పోలీసులు హితవు పలుకుతున్నారు. అయినప్పటికీ.. పోలీసులు హితవచనాలను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పూటుగా తాగేసి బండి లేదంటే కారు నడుపుతూ పోలీసులకు దొరికేస్తుంట

మద్యం సేవించి వాహనం నడపొద్దని పదేపదే ట్రాఫిక్ పోలీసులు హితవు పలుకుతున్నారు. అయినప్పటికీ.. పోలీసులు హితవచనాలను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పూటుగా తాగేసి బండి లేదంటే కారు నడుపుతూ పోలీసులకు దొరికేస్తుంటారు. సెలెబ్రిటీలూ అందుకు మినహాయింపేమీ కాదు. ఇంతకుముందు చాలా మంది స్టార్లు అలా దొరికారు కూడా. 
 
తాజాగా ఓ టాప్ డైరెక్టర్ కుమారుడు కూడా తాగుతూ.. వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయాడట. ఆ టాప్ డైరెక్టర్ ఎవరో కాదు.. బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి సినిమా తీసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తాగి వాహనం నడిపి దొరికిపోయింది అతడి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ. నమ్మబుద్ధి కావడం లేదు కదా. కానీ, ఆ విషయాన్ని చెప్పింది.. స్వయానా కార్తికేయ. షో టైమ్ ఆడియో లాంచ్ సందర్భంగా ఆ విషయాలను వెల్లడించాడు. 
 
‘‘ఒక సారి నేను డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు దొరికపోయాను. అది కూడా తాగుతూ కారు నడిపాను. అది నేరమన్న సంగతి అప్పటికీ నాకింకా తెలియదు. ఎందుకంటే.. వాళ్లు తాగి నడపొద్దన్నారు కానీ.. తాగుతూ నడపొద్దనలేదు కదా. అందుకే.. నేను అప్పటికే కొంత మద్యం సేవించినా.. మళ్లీ మద్యం సేవిస్తూనే కారు నడిపాను. దీంతో పోలీసులు నన్ను ఆపారు. అప్పుడు తెలిసింది.. అది కూడా నేరమేనన్న సంగతి’’ అని తాను చేసిన తప్పును సభాముఖంగా కార్తికేయ ఒప్పేసుకున్నాడు.