సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:20 IST)

సాహోకు అవే హైలైట్స్: ప్రభాస్-శ్రద్ధాకపూర్‌ల మధ్య ఘాటైన రొమాన్స్...

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇందులో కళ్లు చెదిరే యాక్షన్ ఎపి

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇందులో కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్.. మాత్రమే కాకుండా.. రొమాంటిక్ సీన్స్‌ హైలైట్‌గా నిలుస్తాయన్నాడు. సాహో సినిమా రూ.150కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాకి సుజీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
 
ఇందులో ప్రభాస్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ, ఇందులో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఘాటైన రొమాన్స్ కూడా ఉందన్నాడు. ఇందులోని రొమాంటిక్ సీన్స్ కూడా ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తాయని తెలిపాడు. ప్రభాస్ వ్యాఖ్యల్ని బట్టి సాహోలో శ్రద్ధాకపూర్‌తో ప్రభాస్ ఘాటైన రొమాన్స్ వుంటుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.