Dharma Sangrah
✕

శ్రియ రేటు రూ.5 లక్షలు... నమ్మించిన విలేఖరి... సహకరించిన హీరోయిన్ మేనేజర్

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 17 నవంబరు 2019 (10:49 IST)
ప్రముఖ టీవీ చానెల్ ఓ రియాల్టీ షోను నిర్వహిస్తోంది. ఈ షోకు న్యాయ నిర్ణేతగా హీరోయిన్ శ్రియను తీసుకొస్తానని ఓ విలేఖరి నమ్మించాడు. ఇందుకోసం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని శ్రియ మేనేజర్‌కు చెప్పాడు. ఆయన కూడా సరేనంటూ సమ్మతించాడు. చివరకు శ్రియ రాకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 5లో నివాసం ఉండే చంద్రాయుడు, ఓ చానల్‌లో రియాల్టీ షోను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నాడు. దీనికి న్యాయ నిర్ణేతగా శ్రియను పిలిపించాలని భావించాడు. ఈ క్రమంలో చంద్రాయుడికి పరిచయమైన ఓ న్యూస్ పేపర్ విలేకరి, శ్రియకు మేనేజర్‌గా పనిచేసే లక్ష్మీ సింధూజ తనకు పరిచయమని చెప్పాడు. 
 
ఆపై ఆమెను పిలిపించి, ఓ హోటల్‌లో చర్చలు సాగించారు. శ్రియను ఒప్పిస్తానని సింధూజ చెప్పడంతో ఆమె ఖాతాలో రూ.5 లక్షలు జమ చేశాడు. ఆపై నెల రోజులు గడిచినా, శ్రియ రాకపోవడం, సింధూజ, సదరు రిపోర్టర్ అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

అన్నీ చూడండి

సాక్షి కథనం.. జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటోన్న వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌పై మండిపడిన కేటీఆర్.. ఆ ప్రాజెక్టు వల్ల రైతులకు నీటి కొరతంటూ కామెంట్స్

చనిపోయిందనుకున్న మహిళ - దహనవాటికలో కేకలు (వీడియో)

నరేంద్ర మోదీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ : పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్

అన్నీ చూడండి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?

తర్వాతి కథనం
Show comments