గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (11:32 IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో కమల్ కుమార్తె

shruti haasan
సూపర్ స్టార్ రజనీకాంత్‌ సినిమాలో కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో "వేట్టయన్" సినిమా చేస్తున్నాడు. దీని తరువాత,  సూపర్ స్టార్ 171వ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి 'కళుగు' అని పేరు పెట్టారు. ఈ నెల 22న అధికారిక టైటిల్, టీజర్‌ను విడుదల చేయనున్నారు. చిత్రీకరణ జూన్‌లో ప్రారంభం కానుంది. కమల్ హాసన్, రజనీకాంత్ చివరిసారిగా స్క్రీన్‌ను పంచుకుని 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్‌తో కమల్ కూతురు శృతి హాసన్ నటిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. 
 
సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శృతిహాసన్.. ఇటీవల తన తండ్రి నిర్మించిన 'ఇనిమేల్' అనే పాట ఆల్బమ్‌లో కనిపించింది. ఇందులో లోకేష్ కనకరాజ్ కూడా నటించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సినిమాలో శ్రుతి హాసన్ నటించనుండటం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఆమె సూపర్ స్టార్ కుమార్తెగా కనిపిస్తుందని తెలుస్తోంది.