1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జులై 2025 (16:21 IST)

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పరిమితమైతే బెటర్ : శృతిహాసన్

shruti haasan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి హీరోయిన్ శృతిహాసన్ స్పందించారు. పవన్ రాజకీయాలకు పరిమితమైతే మంచిదన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ - శృతిహాసన్ జంటగా "గబ్బర్ సింగ్" సినిమాలో నటించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంతోనే శృతి హాసన్ కెరీర్ మలుపుతిరిగింది. 
 
ఇపుడు శృతిహాసన్ స్టార్ హీరోయిన్ కాగా, పవన్ కళ్యాణ్ మరో స్థాయికి వెళ్ళిపోయారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి శృతి హాసన్ స్పందిస్తూ, వాస్తవానికి 'గబ్బర్ సింగ్' చిత్రంలో తాను నటించనని చెప్పానని, అయితే, ఆ పాత్రలో తనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేదని దర్శకుడు హరీశ్ శంకర్‌ తనను ఒప్పించారని ఆమె తెలిపారు. తనకు తొలి విజయం దక్కిందని టాలీవుడ్‌లోనే స్పష్టం చేశారు.
 
ఇక, పవన్ గురించి మాట్లాడుతూ, సెట్స్‌పై ఆయన ఎక్కువగా రైతుల గురించి, గ్రామాల గురించి మాట్లాడుతుండేవారని ఆమె తెలిపారు. పవన్‌కు రాజకీయ రంగం సరిగ్గా సరిపోతుందని శృతి అభిప్రాయపడ్డారు. కాగా, శృతిహాసన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.