సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 జులై 2024 (15:29 IST)

సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌తో ‘సింబా` రాబోతోంది : అనసూయ

Simmba team with Anasuya
Simmba team with Anasuya
‘ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65 శాతం మంది చనిపోతున్నారు.. అంటే దమ్ము, మందు కంటే.. దుమ్ము వల చనిపోయేది పాతిక రెట్లు ఎక్కువ’.. ‘వస్తువులు మనతో మాత్రమే ఉంటాయి.. కానీ మొక్కలు మనతోనే ఉంటాయి..మనతో పాటు పెరుగుతాయి.. మన తరువాత కూడా ఉంటాయి’.. అంటూ అద్భుతమైన డైలాగ్స్‌తో సాగిన సింబా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన  ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. బుధవారం నాడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
 
అనసూయ మాట్లాడుతూ.. ‘వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తున్నామో.. దానికి ఎలాంటి పర్యవసనాలను చూస్తున్నామో అందరికీ తెలిసిందే. సింబా చాలా మంచి కాన్సెప్ట్‌తో రాబోతోంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. కబీర్, శ్రీనాథ్, వశిష్ట, దివి అద్భుతంగా నటించారు. జగపతి బాబు గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ సినిమా ఒక్కరికి నచ్చినా కూడా ఒక్కరిలోనూ మార్పు తెచ్చినా ఎంతో మార్పు వస్తుంది. ఇంత మంచి చిత్రంలో నాకు ఛాన్స్ రావడం, ఇంత మంది టాలెంటెడ్ పర్సన్‌తో పని చేయడం ఆనందంగా ఉంది.
 
మురళీ మనోహర్ మాట్లాడుతూ..నేను సంపత్ నంది గారితో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాను.  ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. అందరి సహకారంతోనే సినిమాను పూర్తి చేయగలిగాను. నాకు అద్భుతమైన టెక్నికల్ టీం దొరికింది. అందరూ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. మా సినిమా ఆగస్ట్ 9న రాబోతోంది. ఇది సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్. ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
 
నిర్మాత దాసరి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంపత్ నంది గారు చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. మా ఇద్దరిదీ ఒకే ఊరు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకొచ్చాం. జగపతి బాబు గారు కథ నచ్చడంతో ఓకే అన్నారు. అనసూయ గారు ఎంతో బిజీగా ఉన్నారు. అయినా మా సినిమాను ఓకే చేశారు. సినిమాలో నటించిన నటీనటులందరికీ థాంక్స్. కృష్ణ సౌరభ్ ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చారు. మురళీ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమాకు పని చేసిన టెక్నీషియన్లందరికీ థాంక్స్. లవ్ స్టోరీస్‌తో సినిమాలు వస్తూనే ఉంటాయి. మా సినిమాకు కథే హీరో. ప్రతీ కారెక్టర్ హీరోలానే ఉంటుంది. ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముందు తరాల గురించి ఆలోచించండి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఆగస్ట్ 9న రాబోతోన్న మా చిత్రాన్ని అందరూ థియేటర్లో చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
దివి మాట్లాడుతూ.. ‘సింబా చిత్రంలో మంచి సందేశం ఉంది. మేం ప్రాణం పెట్టి సినిమాను చేశాం. నాకు ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
వశిష్ట మాట్లాడుతూ..  మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలని చిన్నప్పటి నుంచీ చెబుతూనే ఉన్నారు. కానీ ఆచరణలోకి తీసుకు రావడం లేదు. ఇలాంటి పాయింట్‌తో సినిమా రావడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది. ఇందులో మంచి పాయింట్, కాన్సెప్ట్ ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
కేతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా వరలక్ష్మీ కాలేజ్‌లోనే షూటింగ్ జరిగింది. షూటింగ్ జరిగినన్ని రోజులు టీంతోనే ఉన్నాను. నేను కూడా ఈ చిత్రంలో కనిపిస్తాను. సమిష్టి కృషితో ఈ సినిమాను ఇంత బాగా తీశారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ.. ‘సింబా చిత్రానికి గానూ నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. చాలా మంచి సినిమా కాబోతోంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో అరుదుగా చిత్రాలు వస్తుంటాయి. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.