మీరంతా లుంగీ కట్టిన మగాళ్లైతే, నేను చీర కట్టిన మగాడినిరా... చుక్కలు చూపించిన హీరోయిన్
ఈమధ్య కాలంలో తెలుగు సినిమాలు తమిళంలోకి, తమిళ సినిమాలు తెలుగులోకి రీమేక్, డబ్బింగ్ అవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. శివకార్తికేయన్, సమంత, కీర్తిసురేష్‌లు హీరోహీరోయిన్లుగా తమిళంలో విడుదలైన "సీమరాజా" సినిమాను ఫిబ్రవరి 8న తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే శివకార్తికేయన్ నటించిన "రెమో" చిత్రం తెలుగులో విడులైంది. సీమరాజా కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఈ సందర్భంగా నిర్మాత సాయికృష్ణ పెండ్యాల చెప్పారు.
ఇక హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్ అద్భుతంగా నటించారు. అతిథి పాత్రలో తక్కువ వ్యవధి కనిపించినప్పటికీ కీర్తి తన నటనతో మెప్పించారు. హీరోకి ధీటుగా ఉండే విలన్ పాత్రలో సిమ్రాన్ నటించారు. విలనిజాన్ని పండించడంలో ఆమె మగాళ్లకు సమానంగా నటించారు.
దానికితోడు ఇందులో ఒక పవర్‌ఫుల్ డైలాగ్ కూడా ఉందట, "మీరంతా లుంగీ కట్టిన మగాళ్లయితే, నేను చీర కట్టిన మగాడిని రా". కమర్షియల్ చిత్రానికి కావలసిన అన్ని ఎలిమెంట్లు ఇందులో ఉన్నాయని, తమిళ సినిమా అనిపించకుండా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా చేసామని, దీన్ని హిట్ చేయడానికి మీడియా సహకారం అవసరమని కోరారు సదరు నిర్మాత.