suvichar
✕

భక్తి గీతాలు ఆలపిస్తున్న పాప్ సింగర్

Written By వాసు
Updated: శుక్రవారం, 24 మే 2019 (15:05 IST)
ఎంతటి హీరోయిన్‌లైనా వయసైపోయాక అక్క, వదిన, అత్తల పాత్రలకు పరిమితం కావడం చూస్తూనే ఉన్నాం... తాజాగా పాప్ సింగర్ స్మిత కూడా దీనికి మినహాయింపేమీ కానని నిరూపించేసుకుంది. 'మసక మసక చీకటిలో.. మల్లెతోట వెనకాలా' అంటూ రీమిక్స్ సాంగ్‌లతో శ్రోతలకు బాగా దగ్గరైపోయిన ఈ పాప్ సింగర్... కొద్ది రోజుల క్రితం వరకు పాటలు, ప్రైవేట్ ఆల్బమ్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం అందరికీ తెలిసిందే. 
 
అయితే... కొత్త తరానికి ఆవిడ బీట్‌లు నచ్చలేదేమో కానీ ఆ తర్వాత క్రమేణా తన పాపులారిటీని కోల్పోయింది. ఒకప్పుడు తెలుగులో రీమిక్స్ పాటలంటేనే స్మిత పాటలు అన్నంతగా ఉండిన మాట నిజమే... కానీ ఇప్పుడొస్తున్న సినిమాల్లోనే పాత పాటలను నేరుగా రీమిక్స్ చేసి వాటికి ఈ తరం హీరో హీరోయిన్లతో స్టెప్పులేయించేస్తూండటం కూడా ఆవిడ డిమాండ్ తగ్గిపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ విధంగా తాను సెట్ కావడం లేదనుకున్న స్మిత తాజాగా తన రూట్‌ని మార్చేసి కొత్తగా భక్తి పాటను ఎంచుకుంది. 
 
సింగర్‌గా తన టాలెంట్ చూపించాలనుకుందో లేక ఎలాగోలా తన పాపులారిటీ తిరిగి సాధించుకోవాలని ప్లాన్ చేసుకుందో తెలీదు కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ భక్తి గీతాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే... ఫోక్‌లు, రీమిక్స్‌లతో హల్చల్ చేసిన ఆమె తాజాగా భక్తి గీతాన్ని ఎంచుకోవడం ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. 
 
ఇక ఈ పాట విషయానికొస్తే.. విష్ణు సహస్ర స్తోత్రాన్ని తనదైన శెలిలో ఆలపించిన, 46 నిమిషాల నిడివి గల వీడియో సీడీని స్మిత తిరుమల నుండి విడుదల చేసింది. ఈ వీడియోలో తెలుగు, ఆంగ్ల భాషల్లో స్తోత్రాలను సబ్ టైటిల్స్‌లో చూపిస్తూ అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్త పడ్డారు. మరి పాప్ సింగర్ గారి ఈ భక్తి మార్గం... వయసైపోయిన హీరోయిన్‌ల తీరుని గుర్తు చేస్తోందిగా..

అన్నీ చూడండి

వైఎస్సార్ మరణం తర్వాత సీఎం పదవి కోసం జగన్ డిమాండ్ చేసారు: విజయసాయి రెడ్డి

జాతీయ పాల దినోత్సవం: భారతదేశ తదుపరి శ్వేత విప్లవం పశుపోషణతోనే ప్రారంభం కావాలి, ఎందుకు?

పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..

మీరట్ హోటల్‌లో యువతిపై లైంగిక దాడి: పోలీసుల అదుపులో నిందితుడు సల్మాన్

మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?

అన్నీ చూడండి

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?

నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కే

తర్వాతి కథనం
Show comments