శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (15:48 IST)

భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. చిట్టితల్లి ఫోటోలు షేర్ చేసిన స్నేహ

Sneha
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో హీరోయిన్‌గా రాణించి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రల్లో కనిపిస్తున్న నవ్వుల సుందరి స్నేహ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటిగా ఫుల్‌ క్రేజ్‌లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రెండో సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు స్నేహ. 
 
పాప పుట్టి ఏడు నెలలకు పైనే అవుతున్నా ఇంతవరకు చిట్టితల్లి ఫోటోలు ఎక్కడా షేర్‌ చేయలేదు. ఈ క్రమంలో భర్త, నటడు ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్భంగా కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు స్నేహ. పాప పేరు ఆద్యంత అని తెలిపారు. 
 
తల్లిదండ్రులు, అన్న విహాన్‌తో కలిసి ఉన్న చిన్నారి ఆద్యంత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హ్యాపీ బర్త్‌డే టూ మై సోల్‌ మేట్‌.. మై లవర్‌ బాయ్‌.. గార్డియన్‌ ఏంజిల్‌.. అంటూ ప్రసన్నకు శుభాకాంక్షలు చెప్పారు. 
 
తన జీవితాన్ని అందంగా మలిచినందుకు ధన్యవాదాలు. సదా మనం ఉన్నతంగా ఉండాలని దీవించి.. శుభాకాంక్షలు తెలిపే వారికి మా పాప ఆద్యంతను పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ కుమార్తె ఫోటోలు షేర్‌ చేశారు.