బాలయ్య-బోయపాటి సినిమాలో స్నేహ....?

Sneha
Sneha
సెల్వి| Last Updated: మంగళవారం, 28 జులై 2020 (13:48 IST)
ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన స్నేహ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతోంది. పలు సినిమాల్లో వదినగా.. కొన్ని సినిమాల్లో కీలక రోల్స్ చేస్తూ రాణిస్తోంది. తొలివలపు ద్వారా తెలుగు తెరకు పరిచయమైన స్నేహ.. ఆపై అవకాశాలు తగ్గడంతో ప్రసన్న అనే తమిళ నటుడిని 11 మే 2012 న చెన్నైలో వివాహం చేసుకుంది.

వివాహానంతరం కీలక పాత్రలు పోషిస్తున్న స్నేహ.. ఇటీవల రామ్ చరణ్ వినయ విధేయ రామలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగులో ఆమె మరో చిత్రాన్ని చేయనుంది. నందమూరి బాలకృష్ణ సరసన ఆమె నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వరుసగా రెండు చిత్రాలు విజయవంతంగా కావడంతో మూడవ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇందులో బాలకృష్ణ పోషించే ఒక పాత్రకు జోడీగా స్నేహను ఎంచుకున్నట్టు తాజా సమాచారం. డబుల్ రోల్‌లో ఉన్న బాలయ్య భార్యగా స్నేహ కనిపిస్తుందట. స్నేహది హీరోయిన్ పాత్ర కాకపోయినా ఒకరకంగా సెకెండ్ హీరోయిన్ పాత్ర అని సమాచారం.

ఇప్పటికే స్నేహ బాలయ్య సరసన ఆమె గతంలో 'పాండురంగడు', 'మహారథి' చిత్రాల్లో కలిసి నటించింది. ఇక ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా నూతన నటిని పరిచయం చేయనున్నట్టు దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే ప్రకటించాడు.దీనిపై మరింత చదవండి :