పెంగ్విన్ తర్వాత కీర్తికి బంపర్ ఆఫర్లు.. కమల్ సరసన మహానటి?

keerthy suresh
keerthy suresh
సెల్వి| Last Updated: బుధవారం, 22 జులై 2020 (19:51 IST)
పెంగ్విన్ సినిమా తర్వాత మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌‌కు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్సు కొట్టేసిన కీర్తి సురేష్.. ప్రస్తుతం సినీ లెజెండ్ కమల్ హాసన్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుందని టాక్ వస్తోంది. అమేజాన్ ప్రైమ్ వీడియోలో మూడు భాషల్లో విడుదలైన కీర్తి సురేష్ చిత్రం పెంగ్విన్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం ద్వారా కీర్తి సురేష్‌ నటనకు ప్రశంసలు అందాయి.

ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ కమల్ హాసన్‌తో కలిసి నటించనుందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హీరోగా నటించి తెరకెక్కిన వేట్టైయాడు విలైయాడు (తెలుగులో రాఘవన్) సినిమాకు సీక్వెల్ రానుంది. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కనిపించనుందని టాక్ వస్తోంది.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని కీర్తి సురేష్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ భాషలలో మరక్కర్: అరబికడలింటే సింహామ్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రంగ్ దే, అన్నాతే చిత్రాల్లో నటిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :